కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూసిన డీఏ పెంపు జరిగింది. 7వ వేతన సంఘం ప్రకారం కరవు భత్యాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీలకమైన ప్రకటన చేసింది. పెద్దమొత్తంలో అంటే 25 లక్షల రూపాయలు అందించనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వడ్డీ ఎంత ఉంటుంది


కేంద్ర ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇంటి కోసం చేసే ఖర్చు తగ్గిపోయినట్టే. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూపంలో గతంలో 7.9 శాతం ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 7.1 శాతానికి తగ్గింది.


47 లక్షలమందికి కలగనున్న ప్రయోజనం


ఇక నుంచి గృహ రుణాలపై తక్కువ వడ్డీ చెల్లించవచ్చు. ఈ విషయమై అధికారిక మెమొరాండం కూడా జారీ అయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 47 లక్షల సిబ్బందికి కీలక ప్రయోజనం చేకూరనుంది. కొత్త వడ్డీ రేటు మార్చ్ 31, 2023 వరకూ అమలు కానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇప్పుడిక ఉద్యోగులకు ఇంటి ఖర్చు తగ్గనుంది. వడ్డీ ఏకంగా 0.8 శాతం తగ్గడంతో ఖర్చులో చాలా వ్యత్యాసముంటుంది.


25 లక్షల వరకూ అడ్వాన్స్


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు..ఈ ప్రభుత్వ స్కీమ్‌లో ఉద్యోగులకు రెండు రకాల ప్రయోజనాలున్నాయి. బేసిక్ శాలరీ లెక్క ప్రకారం 32 నెలలు లేదా గరిష్టంగా 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపంలో అందుతుంది.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ సౌకర్యం లభిస్తుంది. ఇందులో ఉద్యోగులు తమపేరు మీద లేదా భార్య పేరుమీద ఇంటి నిర్మాణం నిమిత్తం అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ పధకం ప్రయోజనం 2023 మార్చ్ 31 వరకూ ఉంటుంది. ఇందులో 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.


Also read: PF Interest: ఈపీఎఫ్ఓ నుంచి గుడ్‌న్యూస్, మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లో వడ్డీ డబ్బులొచ్చేశాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook