Daughters Scheme: మీ కుమూర్తెకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1.5 లక్షల రూపాయలు నజరానా

Daughters Scheme: మీ కుమార్తెకు కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలిస్తుందా..సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా..కాదా..ఇందులో ఎంతవరకూ నిజముందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2022, 07:08 PM IST
Daughters Scheme: మీ కుమూర్తెకు కేంద్ర ప్రభుత్వం నుంచి 1.5 లక్షల రూపాయలు నజరానా

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వార్తలు ప్రచారమౌతుంటాయి. ఇందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని అబద్ధాలుంటాయి. కొన్ని వార్తలు పుకార్లు పుట్టిస్తుంటాయి. అమ్మాయిలకు కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలిస్తుందనే వార్త ఎంతవరకూ నిజమో చూద్దాం..

ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వార్త వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వార్త ఇది. మీకు కూతురుంటే..కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలు అందిస్తుందనేది ఈ వార్త సారాంశం. మరి ఈ వార్త నిజమేనా.. ఇందులో నిజం ఎంతవరకూ ఉంది..పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజమేంటనేది తెలుసుకుందాం. ఈ పధకం ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజనలో భాగంగా ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ వీడియోలో నిజం ఎంతవరకుందో చెక్ చేసింది. ఇదంతా అవాస్తవమని ప్రకటించింది. PIB Fact Check ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్కారీ గురు అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పధకం కింద అందరు కుమార్తెలకు 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెబుతోంది. ఇదంతా ఫేక్ అని PIB Fact Check వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి పధకమేదీ లేదని స్పష్టం చేసింది.

PIB Fact Check ఇదంతా ఫేక్ అని తెలిపింది. అసలు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పేరుతో ఎలాంటి పధకం లేదని వెల్లడించింది. ఇదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేసింది.

Also read: NPS scheme: రూ.150 పెట్టుబడి పెడితే.. మీరు కోటీశ్వరులే.. ఇవిగో మార్గాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News