7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకు ముందే వేతనం పెంపుపై కీలక ప్రకటన ఉండవచ్చు. జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త వినవచ్చు. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ, డీఆర్ రెండూ పెరిగే అవకాశాలున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం డీఏ, కరవు ఉపశమనం డీఆర్‌లో మార్పు అనేది ఏడాదికి రెండుసార్లు ఉంటుంది. జనవరి 1, జూలై 1వ తేదీల్లో ఉంటుంది. సెప్టంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ రెండింటినీ పెంచింది. ఇప్పుడు మరోసారి పెంచేందుకు సిద్ధమౌతోంది. ఈ నేపధ్యంలో హోలీ తరువాత మార్చ్ నెలలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచే అవకాశాలున్నాయి. అందుకే హోలీ నాటికి డీఏ పెంపు రూపంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక బహుమానం లభించవచ్చు.


ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్


కేంద్ర ప్రభుత్వం మార్చ్ 8 తరువాత డీఏ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. అంటే 4200 గ్రేడ్ పేలో 15,500 రూపాయలు తీసుకునే ఉద్యోగి మొత్తం జీతం 39,835 రూపాయలుంటుంది. ఇది ఆరవ వేతన సంఘం ప్రకారం వర్తిస్తోంది.


వేతన కమీషన్


ఇంతకు ముందు 6వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్ 1.86 శాతంగా సిఫారసు జరిగింది. 7వ వేతన సంఘం మాత్రం 2.57 శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతం పెంచాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నెరవేరిస్తే కనీస వేతనం 18 వేల నుంచి 26 వేలు అవుతుంది. 


డీఏ


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు అంటే జనవరి 1, జూలై 1వ తేదీల్లో డీఏ, డీఆర్ పెరుగుతుంటుంది. ఇటీవల అంటే 2022 సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ రెండూ పెరిగాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు 48 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చింది. గత ఏడాది డీఏ 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 38 శాతానికి చేరుకుంది. అంతకు ముందు అంటే మార్చ్ నెలలో డీఏ 3 శాతం పెంచడంతో 31 నుంచి 34 శాతమైంది. 


Also read: March 1 New Rules: ఇవాళ్టి నుంచి మీ జీవితంలో ఏం మారుతున్నాయి, వేటి ధరలు పెరుగుతున్నాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook