March 1 New Rules: ఇవాళ్టి నుంచి మీ జీవితంలో ఏం మారుతున్నాయి, వేటి ధరలు పెరుగుతున్నాయి

March 1 New Rules: మార్చ్ 1వ తేదీ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి కొత్త నెల ప్రారంభమౌతూనే రోజువారీ జీవితానికి సంబంధించి చాలా మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ్టి నుంచి మారుతున్న పరిణామాలు కచ్చితంగా మీపై ప్రభావం చూపించనున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2023, 12:03 PM IST
March 1 New Rules: ఇవాళ్టి నుంచి మీ జీవితంలో ఏం మారుతున్నాయి, వేటి ధరలు పెరుగుతున్నాయి

ఇవాళ్టి నుంచి రైళ్ల టైమ్‌టేబుల్, పాల ధర, గ్యాస్ ధర ఇలా రోజువారీ జీవితానికి సంబంధించి అనేక విషయాల్లో మార్పులు చేర్పులు కన్పించనున్నాయి. దీని ప్రభావం మీ ఖర్చులపై అంటే మీ ఆర్ధిక స్థితి‌పై ప్రభావం చూపించనుంది. బ్యాంకు రుణాల వడ్డీ, నియమ నిబంధనలు, గ్యాస్ ధర ఇలా ఏయే అంశాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసుకోవడం చాలా అవసరం. 

మార్చ్ నెలలో బ్యాంకు సెలవులు

ఇవాళ మార్చ్ 1. చాలా నియమాలు మారిపోయాయి. ఈ నెలలో హోళీ, నవరాత్రి సహా చాలా పండుగలు కూడా ఉన్నాయి. ఫలితంగా ఈ నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. బ్యాంకు సెలవుల గురించి మరిన్ని వివరాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx సందర్శించవచ్చు.

బ్యాంకు రుణాలు మరింత ప్రియం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మరోసారి పెంచేసింది. ఫలితంగా చాలా బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ను పెంచడంతో ఆ ప్రభావం నేరుగా ప్రజల ఖర్చుపై పడుతోంది. అంటే వివిధ రుణాలపై వడ్డీ రేటు పెరుగుతోంది. దాంతో హోమ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐలు పెరుగుతున్నాయి. దాంతో ఇవాళ్టి నుంచి రుణాలు భారం కానున్నాయి.

రైళ్ల టైమ్‌టేబుల్ మార్పు

ఇండియన్ రైల్వేస్ కూడా రైళ్ల టైమింగ్స్ మార్చేసింది. ఇవాళ్టి నుంచి రైల్వే శాఖ 5 వేల గూడ్స్, వేలాది పాసెంజర్ రైళ్ల టైమ్‌టేబుల్‌లో చాలా మార్పులు చేసింది. మీరు తరచూ రైలు ప్రయాణం చేసేవారైతే ఓసారి టైమ్‌టేబుల్ చెక్ చేసుకోవడం మంచిది

పెరిగిన గ్యాస్ సిలెండర్ ధర

హోళీకి ముందే సామాన్యుడికి నిత్యావసర వస్తుధరల్లో మరో షాక్ తగిలింది. వంట గ్యాస్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర పెంచేశాయి. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ఇవాళ్టి నుంచి 50 రూపాయలు పెరిగింది. అదే సమయంలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 350 రూపాయలు పెరిగింది. 

పెరిగిన పాల ధర

ఇవాళ్టి నుంచి ముంబైలో పాల ధర లీటర్ 5 రూపాయలు పెరిగిపోయింది. ముంబైలో పెరిగిన గేదె పాల ధరల నిన్న రాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. ఇవాళ్టి నుంచి పాలు, గ్యాస్, ఈఎంఐ పెరగనుండటంతో ఆ ప్రభావం నేరుగా మీ జేబుపై పడనుంది. ఇవాళ్టి నుంచి మారుతున్న ఈ ధరల్ని పరిగణలో ఉంచుకుని బడ్జెట్ బేరీజు వేసుకోవాలి.

Also read: Gas Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధర, 350 రూపాయలు పెరిగిన గ్యాస్ సిలెండర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News