Aadhaar Photo Update: ఇండియాలో ప్రతి పనికీ అత్యంత అవసరమైంది ఆధార్ కార్డు. కొంతమంది ఆధార్ కార్డుల్లో ఫోటో స్పష్టంగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు ఆధార్‌లో మీ ఫోటోను సైతం క్షణాల్లో ఎడిట్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నుంచి ఆధార్ కార్డులో ఫోటో కూడా క్షణాల్లో మార్చుకోవచ్చు. ఆఫ్‌లైన్ ప్రక్రియకు చాలా టైమ్ పడుతుంది. కాబట్టి ఆన్‌లైన్‌లో క్షణాల్లోనే ఆధార్ కార్డుపై ఫోటోను మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు ఫోటోను ఎలా మార్చుకోవచ్చో చూద్దాం..


మీ ఆధార్ కార్డుపై ఫోటో మార్చాలనుకుంటే..కొత్త ఫోటోను ఆన్‌లైన్ విధానంలో మార్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే యూఐడీఏఐ ద్వారా ఆధార్ కార్డులో పేరు, మొబైల్ నెంబర్, చిరునామా, జెండర్, పుట్టిన తేదీ, ఫోటోల్ని మార్చుకోవచ్చు. 


యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఫోటో మార్చుకునే ప్రక్రియ


ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డు విభాగంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్ నింపి శాశ్వత ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో సమర్పించాలి. అక్కడే మీ బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ కోసం 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ జారీ అవుతుంది. అందులో యూఆర్ఎన్ ఉంటుంది. ఈ యూఆర్ఎన్ సహాయంతో అప్‌డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్ అవుతుంది. 


Also read: e Nomination Process: మీ పీఎఫ్ ఖాతా ఇ నామినేషన్ దాఖలైందా, ఇ నామినేషన్ ఎలా చేయాలి, లాభాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook