Free Aadhaar Update on Uidai.gov.in: ప్రస్తుతం ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా.. ప్రభుత్వ పథకాలు అందుకోవాలన్నా.. సిమ్ కార్డు తీసుకోవాలన్నా కచ్చితంగా ఆధార్ కార్డు కావాల్సిందే. ప్రజలు తమ ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జూన్ 14వ తేదీ వరకు ఆధార్ పత్రాల ఆన్‌లైన్ అప్‌డేషన్‌ సేవలను ఉచితం చేసింది. సాధారణంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి రూ.50 నుంచి రూ.100 ఫీజు వసూలు చేస్తారు. అయితే UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం జూన్ 14వ వరకు సమయం ఉంది.


ఉచిత సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం అని UIDAI తెలిపింది. మీరు మీ సేవా, ఇతర ఆధార్ కేంద్రాలలో వివరాలను అప్‌డేట్ చేసుకుంటే 50 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు జారీ చేసి పదేళ్లు పూర్తయినా.. ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్‌ చేసుకోని వారిని.. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. 


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి


==> ఆధార్ నంబర్‌తో https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి
==> ఇక్కడ 'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' ఆప్షన్‌ను ఎంచుకోండి 
==> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి
==> ఆ తరువాత మీరు 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయండి
==> ఇక్కడ ఏదైనా అప్‌డేట్ చేయాలనుకుంటే చేసుకోండి 
==> చివరగా 'సబ్మిట్' బటన్‌ను క్లిక్ చేయండి. సంబంధింత పత్రాలను అప్‌డేట్ చేయడానికి వాటి కాపీలను అప్‌లోడ్ చేయండి.
==> ఆధార్ అప్‌డేట్ అభ్యర్థన పూర్తవుతుంది. 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) మీకు వస్తుంది
==> ఈ నంబరు ద్వారా ఆధార్ చిరునామా అప్‌డేట్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు.  
==> అప్‌డేట్ అయిన తరువాత ఆన్‌లైన్‌లో మీ కొత్త ఆధార్ కార్డును డౌన్‌లోన్ చేసుకోండి.


Also Read: BGMI Returns: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. BGMI వచ్చేసింది.. కండీషన్స్ అప్లై  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook