ఆధార్‌కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి 4,78,000 రుణం ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మీక్కూడా ఆ అర్హత ఉందా లేదా..అసలు ఈ విషయంలో ఉన్న నిజాలేంటనేది పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో ఏ పనికైనా సరే ఆధార్‌కార్డు అత్యంత కీలకం. అదే సమయంలో ఆధార్‌కార్డు హోల్డర్లకు 4 లక్షల 78 వేల రుణం అందనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్‌డేట్ అందింది. ఆధార్ కార్డు హోల్డర్లకు రుణం ఇస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఏకంగా 4,78,000 రుణం ఇస్తున్నారనే ప్రచారమిది ఈ మెస్సేజ్‌లో నిజం ఎంతవరకుందో ఇప్పుడు తెలుసుకుందాం..


పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ద్వారా నిజమెంతుందనేది తేటతెల్లమైంది. పీఐబీ తన అధికారిక ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వైరల్ మెస్సేజ్ పూర్తిగా అవాస్తవమని పీఐబీ ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అసలు ఇలాంటి పధకం ఏదీ అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఆధార్ కార్డు రుణం వ్యవహారమంతా ఫేక్ అని తేలింది. దీంతోపాటు అందర్నీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరింది. 


ఫ్యాక్ట్‌చెక్ ఎలా చేయాలి


సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో తప్పుడు వార్తలు వైరల్ అవుతుంటాయి. మీకు సోషల్ మీడియా ఎక్కౌంట్ లేదా వాట్సప్ వార్తలపై అనుమానముంటే..పీఐబీ ద్వారా ఫ్యాక్ట్‌చెక్ చేయవచ్చు. ఇలా చేసేందుకు https://factcheck.pib.gov.in/ ఓపెన్ చేయాలి. ఇది కాకుండా వాట్సప్ నెంబర్  8799711259  లేదా మెయిల్ ఐడీ pibfactcheck@gmail.comకు ఈ విషయాన్ని పంపించడం ద్వారా చెక్ చేయవచ్చు.


Also read: Social Media: కేవలం టైమ్‌పాస్ ఒక్కటే కాదు..లక్షలు సంపాదించే మార్గం సోషల్ మీడియా, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook