Here is Simple Steps to Check All SIM Cards Registered on Your Aadhaar Card Number: ప్రస్తుత రోజుల్లో ఆధార్‌ కార్డు నంబర్ లేకుంటే ఏ పని జరగదు. ప్రతి చిన్న పనికి కూడా ఆధార్‌ తప్పనిసరి అయింది. గ్యాస్ సిలిండర్ కావాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, వైఫై కనెక్షన్‌ తీసుకోవాలన్నా, పాస్ పోర్ట్ అప్లై చేయాలన్నా, రేషన్ తీసుకోవాలన్నా,  సిమ్‌ తీసుకోవాలన్నా.. ఆధార్‌ నంబర్ తప్పనిసరి. ప్రస్తుతం ఆధార్‌ కార్డు కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. అయితే 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను కొందరు మనకు తెలియకుండానే దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా సిమ్‌ తీసుకోవడానికి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త సిమ్‌ కార్డు పొందటానికి మీ ఆధార్‌ నంబర్‌ను కొందరు ఆకతాయిలు మీకు తెలియకుండానే వాడుకొని ఉండొచ్చు. అయినా కూడా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. చాలా సులువుగా మీ ఆధార్‌ నంబర్‌పై యాక్టివ్‌గా ఉన్న సిమ్‌ల వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు రిపోర్టు చేసి ఆ సిమ్‌ సేవలను వెంటనే విలిపివేయొచ్చు. ఆధార్‌ నంబర్‌పై యాక్టివ్‌గా ఉన్న సిమ్‌ల వివరాలు తెలుసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 'టాఫ్‌-కాప్‌' పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ఆరంభించింది. దీని ద్వారా మన పేరుతో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ కనెక్షన్లను తేలికగా గుర్తించొచ్చు. 


టాఫ్‌-కాప్‌ వెబ్‌సైట్‌ సేవలను ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిమితం చేసింది. తెలంగాణ, ఏపీ, కేరళ, రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌లో మాత్రమే టాఫ్‌-కాప్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే https://tafcop.dgtelecom.gov.in/ లోకి తమ ఆధార్‌ నంబర్‌పై ఉన్న మొబైల్‌ కనెక్షన్లను తెలుసుకోవచ్చు. సింపుల్ స్టెప్స్ ఇలా ఫాలో అవండి. 


స్టెప్స్ ఇవే:
# https://tafcop.dgtelecom.gov.in/ లోకి వెళ్లాలి.
# మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేసి ‘రిక్వెస్ట్‌ ఓటీపీ’ ప్రెస్ చేయాలి.
# ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేసి ‘వాలిడేట్‌’పై క్లిక్‌ చేయాలి.
# మన ఆధార్‌ నంబర్ మీద జారీ అయిన మొబైల్‌ నంబర్లు కనిపిస్తాయి.
# వాటిలో మనకు సంబంధించని నంబర్లు ఉంటే రిపోర్టు చేయొచ్చు. ముందుగా నంబర్ ఎంచుకుని.. దిస్‌ ఈజ్‌ నాట్‌ మై నంబర్‌, నాట్‌ రిక్వయిర్డ్‌, రిక్వయిర్డ్‌ ఆప్షన్లలో మీకు అవసరమైనది సెలెక్ట్‌ చేసుకొని, రిపోర్టు చేయాలి. వెంటనే ఫోన్‌కు సందేశం వస్తుంది.


Also Read: Tamannaah Marriage: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా.. వరుడు ఎవరో తెలుసా?


Also Read: ఐపీఎల్ 2023 మినీ వేలం.. జింబాబ్వే ప్లేయర్‌పై కురవనున్న కాసుల వర్షం! మూడు ప్రాంఛైజీలు పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook