Dare To Dream Awards 2022: ఈ ఏడాది డేర్‌ టు డ్రీమ్ అవార్డుల నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. ఈ సంవత్సరం జీ బిజినెస్‌తో కలిసి SAP ఇండియా డేర్ టు డ్రీమ్ అవార్డ్స్ సీజన్ 4 నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రతి ఒక్కరు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో సహా ప్రతి ఒక్కరిపై లాక్‌డౌన్ ఆంక్షలు విధించడంతో వ్యాపార రంగం బాగా నష్టాల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా ఆదాయ మార్గాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి కష్ట సమయంలో ధైర్యంగా పోరాడి.. సవాళ్లను అధికమించి లీడర్‌గా ముందుండి నడించిన స్ఫూర్తిదాయక నాయకులను డేర్ టు డ్రీమ్ అవార్డ్స్‌ 2022కు ఎంపిక చేయనున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారికి ఈ అవార్డులు వరించనున్నాయి.



నామినేషన్ ప్రక్రియ ద్వారా ఎంపిక:
డేర్ టు డ్రీమ్ అవార్డులకు నామినేషన్ ప్రక్రియ ద్వారా విజేతలను ఖరారు చేస్తారు.  విభిన్నమైన నేపథ్యాల నుంచి వివిధ కేటగిరిల నుంచి అవార్డులకు ఎంపిక చేస్తారు.
ఆవిష్కరణ, సాంకేతికత, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌, కస్టమర్ సముపార్జనలో మార్గదర్శకులుగా ఉన్న వ్యాపార నాయకులను జ్యూరీ సభ్యులు గుర్తిస్తారు. నాయకత్వం అంటే ఒక పదవి కాదు.. కష్ట సమయంలో ముందుండి నడిపించడం అని నిరూపించిన వారిని డేర్‌ టు డ్రీమ్ అవార్డులకు ఎంపిక చేయనున్నారు.


జ్యూరీలో సభ్యులుగా BSE SME అండ్ స్టార్టప్స్ హెడ్ అజయ్ ఠాకూర్, అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి, జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్‌ అనిల్ సింఘ్వి ఉన్నారు. జ్యూరీ మెంబర్స్‌గా తమను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని వారు తెలిపారు.


సుమన్ చౌదరి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (R&D) ప్రాజెక్ట్‌లో భారత్ నంబర్ వన్ కొనసాగుతోందన్నారు. మన దేశం అన్ని పరిశ్రమలలో విస్తరించి ఉందన్నారు. భారత్‌లో అతిపెద్ద వేడుకగా జరుపుకునే డేర్ టు డ్రీమ్ అవార్డుల ఎంపికలో భాగం కావడం తాను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కాకుండా.. దేశంలో అన్ని రంగాలను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.


మైక్రో, స్మూక్ష, మధ్య తరహా బిజినెస్‌లో రాణించి.. సాధారణ స్థాయి నుంచి అత్యుత్తమ స్థానానికి ఎదిగిన ఎందోరో రియల్ హీరోలు ఉన్నారని
జ్యూరీ మెంబర్ అనిల్ సింఘ్వి తెలిపారు. ఇప్పటివరకు ఎవరు గుర్తించని వారిని ఎంపిక చేస్తామని.. ప్రశంసలు, సత్కారం వారి విజయాన్ని పరిపూర్ణం చేస్తాయన్నారు.


డేర్ టు డ్రీమ్ అవార్డ్స్ ప్రారంభోత్సవం గురించి అజయ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సొంత కంపెనీలో నాయకులుగా ఉన్నవారినే కాకుండా.. న్యూ ఇండియాకు మార్గదర్శకులుగా ఉన్న వారిని గౌరవిస్తామన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ మార్గదర్శకులను గుర్తించడమే మా లక్ష్యమన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి.. మరింత వెలుగులోకి వచ్చేందుకు ఇది సరైన వేదిక అన్నారు. అర్హులైన వారందరూ తమ పేర్లను నామినేషన్లకు ఇస్తారని తాము ఆశిస్తున్నామని చెప్పారు.  


వెలుగులోకి వచ్చేందుకు అద్భుత సమయం:
స్ఫూర్తిదాయకమైన మీ రియల్ లైఫ్ స్టోరీ ప్రపంచంతో పంచుకోవడానికి డేర్‌ టు డ్రీమ్ అవార్డు నామినేషన్స్‌కు పంపించండి. ఈ ఈవెంట్‌లో మీరు, మీకు తెలిసిన వారు లేదా  సంస్థను ఈ అవార్డు కోసం నామినేట్ చేయవచ్చు. మీరు వ్యాపార నాయకుడైతే, మిమ్మల్ని లేదా మీ సంస్థను అతిపెద్ద వ్యవస్థాపక అవార్డుకు నామినేట్ చేయడానికి ఈ అవకాశాన్ని కోల్పోకండి. అక్టోబర్ 29వ తేదీలోపు డేర్‌ టు డ్రీమ్ అవార్డుకు నామినేషన్లు పంపించేందుకు గడువు ఉంది. పూర్తి వివరాల కోసం డేర్ టు డ్రీమ్ అవార్డ్స్‌ (Dare to Dream Awards) వెబ్‌సైట్‌ను సందర్శించండి. ప్రముఖ బిజినెస్‌ లీడర్స్‌ కలవడంతో పాటు మీ నాయకత్వ పటిమకు తగిన గుర్తింపు పొందే అవకాశం కోల్పోకండి.


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?


Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి