షేర్ మార్కెట్‌లో ఇప్పుడు సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్ శరవేగంగా పెరుగుతోంది. ఈ కంపెనీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద విండ్ పవర్ కంపెనీగా ఉంది. ఈ కంపెనీ షేర్ ఇటీవల వేగంగా పెరుగుతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్‌లో ప్రస్తుతం దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చర్చల్లో ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం అదానీ గ్రూప్ చాలా కంపెనీల్ని టేకోవర్ చేసింది. ఇటీవల మరో కీలక చర్య చేపట్టింది. అదానీ గ్రూప్ నుంచి విండ్ పవర్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్‌కు భారీ ఆర్డర్ లభించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఈ ఆర్డర్ పొందగానే..షేర్ ఒక్కసారిగా రాకెట్‌లా పెరిగింది.


సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్‌కు అదానీ గ్రూప్ నుంచి 48.3 మెగావాట్ల పవన్ టర్బైన్ల కాంట్రాక్ట్ లభించింది. కంపెనీ ఈ విషయాన్ని ఇవాళ ప్రకటించింది. ఈ ఆర్డర్‌లో భాగంగా కంపెనీ ఒక హైబ్రిడ్ లైటిస్ ట్యూబ్లర్ టవర్‌తో పాటు విండ్ టర్బైన్ జనరేటర్‌కు చెందిన 23 యూనిట్లు స్థాపించనుంది. 


గౌతమ్ అదానీ గ్రూప్ నుంచి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీకు ఆర్డర్ లభించగానే..కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. కేవలం ఒక్కరోజులోనే సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్ ధర 5.89 శాతం పెరిగి 7.90 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు సోమవారం నాడు ఈ కంపెనీ షేర్ 7.46 రూపాయలకు క్లోజ్ అయింది. 


Also read: Kisan Vikas Patra: జీరో రిస్క్, రెట్టింపు రిటర్న్స్ ఇచ్చే పోస్టాఫీసు పథకమిదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook