బ్యాంకుల కంటే పోస్టాఫీసు పథకాల్లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంటోంది. అందుకే పోస్టాఫీసు పథకాలకు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరిగింది. ఇవి పూర్తిగా సురక్షితం. అంతేకాకుండా రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంటాయి. పోస్టాఫీసులో జీరో రిస్క్‌తో రెట్టింపు లాభాలిచ్చే పథకం గురించి తెలుసుకుందాం.
పోస్టాఫీసు పథకాల్లో రిస్క్ అనేది ఉండదు. ఈక్విటీ, మ్యూచ్యువల్ ఫండ్స్‌లో కూడా రిటర్న్స్ అధికంగా ఉంటాయి కానీ..రిస్క్ ఎక్కువుంటుంది. బ్యాంకుల్లో వడ్జీ తక్కువ. అందుకే పోస్టాఫీసు పథకాలకు క్రేజ్ పెరుగుతోంది. పోస్టాఫీసు స్కీమ్క్ సహజంగా దీర్ఘకాలానికి ఉంటాయి. ఈ స్కీమ్ కూడా అలాంటిదే. పోస్టాఫీసు పథకాలకు ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. అంటే ఇందులో రిస్క్ అనేది అస్సలుండదు. దాంతోపాటు పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. అదే కిసాన్ వికాస్ పత్ర పథకం.
ఈ స్కీమ్ సమయం 124 నెలలు. అంటే 10 ఏళ్ల 4 నెలలు. ఒకవేళ మీరు ఈ పథకంలో 2022 ఏప్రిల్ నుంచి జూన్ 2022 మధ్యలో పెట్టుబడి పెడితే పదేళ్లలో ఆ డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడికి పరిమితి లేదు. ఎంతైనా పెట్టవచ్చు. కిసాన్ వికాస్ పత్రను వేయి రూపాయలు కనీస మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం 1988లో ప్రారంభమైంది.
ఈ పథకంలో పెట్టుబడికి పరిమితి లేకపోవడంతో మనీ లాండరింగ్ ముప్పు ఉంటుంది. అందుకే ప్రభుత్వం 2014లో 50 వేల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే..పాన్‌కార్డ్ అనివార్యం చేసింది. 10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఆదాయం ప్రూఫ్ కూడా సమర్పించాలి. ఐటీఆర్, పే స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి.
Also read: Aadhaar Link: మీ మెయిల్ ఐడీతో ఆధార్ లింక్ చేశారా, లేకపోతే అన్నీ ఆగిపోతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook