Adani group ప్రపంచం కుబేరుల్లో ఐదవ స్థానాన్ని దక్కించుకున్న గౌతమ్ అదానీ ఇప్పుడు హెల్త్‌‌‌‌కేర్ రంగంలో దృష్టి సారించారు. హెల్త్‌ కేర్‌లో మంచి లాభాలు ఉండడంతో  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం  అవుతున్నారు.  ముందు రెండు పెద్ద ఆసుపత్రులను నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం. దీనికితోడు  డయాగ్నోస్టిక్ చైన్‌‌‌‌లు, డిజిటల్ ఫార్మసీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. విమానాశ్రయాల నుండి ఓడరేవుల వరకు అన్ని రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్‌ ఇప్పుడు హెల్త్ సెక్టార్‌ లో  రావడంలో పెద్ద విశేషం ఏమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే అదానీ గ్రూప్‌కు చెందిన పులువురు ఉన్నతస్థాయి అధికారులు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో పాటు  గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. హెల్త్‌‌‌‌కేర్ రంగంలోకి తాము వస్తున్నట్లు చెప్పారు. తమ వద్ద ఉన్న ప్రతిపాదనలను వివరించారు. హెల్త్‌ సెక్టార్‌లో జాయింట్ వెంచర్ ద్వారా తన ప్రస్తానాన్ని ప్రారభించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. దీనిపై  త్వరలోనే ఒక ప్రకటన కూడా వెలువడనుంది. సుమారు రూ.30 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హెల్త్​కేర్​ సెక్టార్ లో  ఇంకా కార్పోరేట్ సంస్థలు ప్రవేశించలేదు. జనాభాకు తగినన్ని ఆసుపత్రులు లేవని గుర్తించిన  అదానీ గ్రూప్‌ లో ఈరంగంలో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో మారిన జీవన విధానం కారణంగా షుగుర్​, బీపీ వంటి  వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇవన్నీ హెల్త్​కేర్​ సెక్టార్‌కు లాభాల పంట పండిస్తాయని అదానీ గ్రూప్ భావిస్తోంది. 


ఇటీవలే ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.620 కోట్లకు ఆన్‌‌‌‌లైన్ ఫార్మసీ నెట్‌‌‌‌మెడ్స్ లో వాటాలను కొనుగోలు చేసింది. ఇక కిందటి సంవత్సరం టాటా గ్రూప్ డిజిటల్ హెల్త్ కంపెనీ  ఈ–ఫార్మసీ 1ఎంజీ టెక్నాలజీస్ ప్రైవేట్‌‌‌‌లో వాటాను కొనుగోలు చేసింది. అమెజాన్ కిందిట సంవత్సరం భారత్‌లో తన ఆన్‌‌‌‌లైన్ ఫార్మసీ సేవలను ప్రారంభించింది. పవర్, గ్రీన్ ఎనర్జీ,  ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్​పోర్టుల మేనేజ్​మెంట్​ వ్యాపారాల్లో  అగ్రగామిగా నిలిచిన అదానీ గ్రూప్‌ ఈ మధ్యే  స్విస్ సిమెంట్ తయారీ సంస్థ హోల్సిమ్ గ్రూప్ కు అంబుజా సిమెంట్స్ ,  ఏసీసీ  లోని వాటాలను కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతోంది. 


also read LIC IPO Opens: మార్కెట్‌లోకి రానున్న జంబో ఐపీఓ, మొత్తం వివరాలు ఇవే..!


alsor read Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్... రూ.65 వేల ఐఫోన్ 12పై భారీ తగ్గింపు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook