Cooking Oil Prices: సామాన్యులకు అందుబాటులోకి వంట నూనెలు..అదానీ విల్మర్ కంపెనీ కీలక నిర్ణయం..!
Cooking Oil Prices: దేశంలో సామాన్యులకు ఊరట కల్గుతోంది. క్రమేపి వంట నూనెల ధరలు తగ్గుతున్నాయి. తాజాగా మరికొన్ని కంపెనీలు ధరలను తగ్గించాయి.
Cooking Oil Prices: సాధారణ వినియోగదారులకు అదానీ విల్మర్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫార్చూన్ బ్రాండ్‌పై విక్రయించే వంట నూనెల ధరలను తగ్గించింది. అంతర్జాతీయ పరిణామాలతో వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అదానీ విల్మర్ కంపెనీ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు భారీగా దిగి వచ్చాయి. త్వరలో ఈధరలు అందుబాటులోకి రానున్నాయి.
అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశంలోనూ అదుపులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈక్రమంలోనే తక్షణమే ధరలను తగ్గించాలని సదురు కంపెనీలను ఆదేశించింది. దీంతో ఆయా కంపెనీలు వంట నూనెల ధరలను తగ్గిస్తున్నాయి. తగ్గిన ధరలు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని అదానీ విల్మర్ కంపెనీ ఎండీ, సీఈవో అంగ్షు మల్లిక్ తెలిపారు.
తగ్గిన ధరలు అందుబాటులోకి వస్తే ఫార్చూన్ సోయా బీన్ ఆయిల్ రూ.195 నుంచి రూ.165కు తగ్గనుంది. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.210 నుంచి రూ.199కి, ఆవ నూనె గరిష్ఠ ధర రూ.195 నుంచి రూ.190కి తగ్గుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ రూ.225 నుంచి రూ.210కి తగ్గుతుందని సదరు కంపెనీ వెల్లడించింది. వేరుశనగ నూనె రూ.220 నుంచి రూ.210కి, రాగ్ బ్రాండ్‌పై విక్రయించే వనస్పతి రూ.200 నుంచి రూ.185కి చేరనుంది. రాగ్ పామోలిన్ రూ.170 నుంచి రూ.144కి తగ్గనుంది. వంట నూనెల ధరలు తగ్గుతుండటంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also read:Vijayendra Prasad: రాజ్యసభలో ఎంపీగా సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం..!
Also read:Ambati Rambabu: పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చకు రావాలి..టీడీపీ నేతలకు అంబటి రాంబాబు సవాల్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook