Upcoming Electric Cars in India Under 10 Lakhs: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది.పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అందరూ ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి మొగ్గుచూపుతున్నారు. డిమాండ్ దృష్ట్యా కార్ల తయారీ సంస్థలు కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల విక్రయదారుగా కొనసాగుతోంది. మారుతీ సుజుకీ, ఎంజీ మరియు సిట్రోయెన్ వంటి కంపెనీలు కూడా పోటీలో ఉన్నాయి. దాంతో అతి త్వరలో మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ కార్ల గురించి ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Tiago EV:
టాటా కంపెనీ ఇప్పటికే టియాగో ఈవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత చౌకైన కార్లలో ఇది ఒకటి. టాటా టియాగో ఈవీ ధర రూ. 8.49 లక్షలతో మొదలై రూ. 11.79 లక్షల వరకు ఉంది. జనవరి 2023 నుంచి కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 19.2kWh మరియు 24kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్ చేస్తే.. 315 కిమీ ప్రయాణం చేయొచ్చు. దీని పవర్ అవుట్‌పుట్ 74bhp మరియు 114Nm.


Citroen eC3:
టాటా టియాగో ఈవీకి పోటీగా సిట్రోయెన్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఈసీ3ని తీసుకువచ్చింది. దీని బుకింగ్ రూ.25,000తో చేసుకోవచ్చు. ఈ కారు ధరలు ఫిబ్రవరి 2023లో వెల్లడికానున్నాయి. దాదాపుగా ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది 29.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో 57bhp శక్తిని మరియు 143nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌తో 320 కిమీల రేంజ్‌ను అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ ఇండియాలో లాంచ్‌ చేయడం ఇదే మొదటి సారి..


MG Air EV:
ఎంజీ భారతదేశంలో 3 డోర్స్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. దీని ప్రారంభ ధర రూ. 10 లక్షలు. ఇది కాంపాక్ట్ పరిమాణంలో ఉంటుంది. పొడవు సుమారు 2.9 మీటర్లు ఉంటుంది. ఈ కారు దాదాపు 20-25kWh సామర్థ్యంతో బ్యాటరీతో వస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 200-300 కిమీల రేంజ్‌ను అందించవచ్చు. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


Maruti Electric Car:
మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారు 2025 ప్రారంభంలో ఉండొచ్చు. కొత్త మారుతి ఎలక్ట్రిక్ SUV 4.2 మీటర్ల పొడవుతో వస్తుంది. ఇది 60kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. పూర్తి ఛార్జ్‌పై 550 కిమీ ప్రయాణం చేయొచ్చు. దీని ధర రూ. 13 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉంటుంది.


Also Read: Hyundai Creta Price: కేవలం 7.5 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!  


Also Read: Ariyana Glory : సమంత టైపులో అరియానా.. శాకుంతలం లుక్‌లో బిగ్ బాస్ బ్యూటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.