క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లో ( Cloud communication market ) వృద్ధి కన్పిస్తోంది. వృద్ధికి తగ్గట్టు స్పేస్ ఇంకా ఉంది. ఇప్పుడీ స్పేస్ ను పరిగణలో తీసుకుని ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్ ( Airtel ) రంగంలో దిగింది. ఎయిర్ ఐక్యూ ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతియేటా గ్రోత్ కన్పిస్తోంది. అంతేకాదు ఈ మార్కెట్లో ఇంకా స్పేస్ కన్పిస్తోంది. అందుకే ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ ( Bharati Airtel ) ఈ రంగంలో దిగిందిప్పుడు. క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లో ప్రవేశించింది.  ఎయిర్ ఐక్యూ  ( Airtel IQ ) పేరుతో ఓమ్నీ కమ్యూనికేషన్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసింది. ఇండియన్ కమ్యూనికేషన్స్ లో ఇదొక విప్లవాత్మకమార్పుగా కంపెనీ పేర్కొంది. 


ఇండియాలో ప్రస్తుతం క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్ వ్యాల్యూ ఒక బిలియన్ డాలర్లు ( Indian Cloud business is 1 billion ) గా ఉంది. ప్రతియేటా ఇది 20 శాతం వృద్ధి చెందుతోంది. ఎయిర్ టెల్ ప్రవేశంతో ఈ రంగంలో అడుగెట్టిన తొలి టెలికం కంపెనీగా ఖ్యాతి గాంచింది. ఎయిర్ టెల్ ప్రారంభించిన ఎయిర్ ఐక్యూ సేవల్ని వినియోగించుకోడానికి ఇప్పటికే స్విగ్గీ ( Swiggy ) , జస్ట్ డయల్ ( Just Dial ) , అర్బన్ కంపెనీ, హావిల్స్, డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్, రాపిడో ( Rapido ) ఒప్పందం చేశాయి. వాణిజ్యపరంగా ఇప్పటికే అందుబాటులో వచ్చిన ఎయిర్ టెల్ ఐక్యూ బీటా వెర్షన్ ఉపయోగిస్తున్నాయి ఈ కంపెనీలు. పే పెర్ సర్వీసెస్ అంటే సేవలు ఉపయోగించుకున్నంతవరకే చెల్లింపులు జరిపే వెసులుబాటు కల్పించింది ఎయిర్ టెల్. 


ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్స్ తో పోలిస్తే..ఈ ప్లాట్ ఫాం కంపెనీలకు 40 శాతం ఖర్చు తగ్గిస్తుందని ఎయిర్ టెల్ బిజినెస్ తెలిపింది.  తమ సంస్థకు చెందిన ఇన్ సైడ్ ఇంజనీరింగ్ సామర్ధ్యం ద్వారా ఎయిర్ టెల్ ఐక్యూ వంటి ఉత్పత్తుల్ని అభివృద్ధి చేశామని వెల్లడించింది. ఇప్పటికే తమ వద్ద 15 వందలమందితో డిజిటల్ టాలెంట్ ఉందని ఎయిర్ టెల్ తెలిపింది. Also read: IRAN: విషమిస్తున్న పరిస్థితి..ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరి మరణం