Airtel Micro ATM: బ్యాంకింగ్ సేవల్లో ఎయిర్‌టెల్, మైక్రో ఏటీఎంలు ప్రారంభం
Airtel Micro ATM: ప్రముఖ టెలీకం కంపెనీ కొత్తగా బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకు కస్టమర్లకు ఉపయోగపడేలా కొత్తగా ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎంలు ప్రారంభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Airtel Micro ATM: ప్రముఖ టెలీకం కంపెనీ కొత్తగా బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకు కస్టమర్లకు ఉపయోగపడేలా కొత్తగా ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎంలు ప్రారంభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్స్ విభాగంలో ఎంట్రీ ఇచ్చిన ఎయిర్‌టెల్ ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ సేవల్ని కూడా ప్రారంభిస్తోంది. టెలీకం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడం కొత్త పరిణామం. బ్యాంకు కస్టమర్లకు దోహదపడేలా ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎంలను ప్రారంభించింది. ఈ ఏటీఎంల నుంచి ఏ బ్యాంకు కస్టమర్ అయినా..నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక్కొక్క లావాదేవీకు 10 వేల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. దశలవారీగా అన్ని ప్రాంతాల్లో మైక్రో ఏటీఎంలను ప్రవేశపెట్టనున్నట్టు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు మైక్రో ఏటీఎం లావాదేవీల్ని మరింత సులభం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్‌తో అనుసంధానమైంది. ఏ బ్యాంకు ఖాతాదారుడైనా ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎం సేవల్ని వినియోగించుకోవచ్చు.
ముందుగా నగరాల్లో, తరువాత అర్బన్ ప్రాంతాల్లో 1 లక్షా 50 వేల యూనిట్లను ఎయిర్‌టెల్ ఏర్పాటు చేయనుంది. త్వరలో గ్రామీణ ప్రాంతాల్ల విస్తరించనున్నామని ఎయిర్‌టెల్ ప్రతినిధి తెలిపారు.
Also read: Paytm All In One Pos: ప్రతి వ్యాపారం, వ్యాపార లావాదేవీకి పేటీఎం ఆల్ ఇన్ వన్ POS..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook