Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ సదుపాయం!
Airtel OTT Plans: రిలయన్స్ జియో తర్వాత ఇప్పుడు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు భారతీ ఎయిర్ టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. ఆ రీఛార్జ్ ప్లాన్స్ తో మూడు నెలల పాటు డిస్నీ + హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంది.
Airtel OTT Plans: తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను భారతీ ఎయిర్ టెల్ ప్రవేశపెట్టింది. రీఛార్జ్ ప్లాన్స్ వరుసగా రూ. 399, రూ. 839 ద్వారా మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనుంది. దీంతో పాటు ఏడాది పాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ప్రయోజనాలను పొందవచ్చు. అదెలాగో ఇప్పుడే తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్..
ఎయిర్ టెల్ నెట్ వర్క్ కు సంబంధించిన రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ తో అపరిమిత కాలింగ్ తో పాటు రోజుకు 2.5 GB హైస్పీడ్ డేటా, 100 SMSలు లభిస్తాయి. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజుల వ్యాలిడిటతో అందుబాటులో ఉంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, అపోలో 24x7 సర్కిల్ తో పాటు మరిన్ని యాప్స్ ఉచితంగా ప్రయోజనాలను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్..
ఎయిర్ టెల్ టెలికాం నెట్ వర్క్ ప్రవేశపెట్టిన రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో వచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మూడు నెలల పాటు డిస్నీ + హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 2 GB హైస్పీడ్ డేటాతో పాటు 100 SMSలు లభిస్తాయి. దీంతో పాటు ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ మొబైల్ ప్యాక్ తో పాటు ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను కూడా పొందుతారు.
Also Read: elon musk on stock market investment: షేర్‌మార్కెట్ పెట్టుబడులపై ఎలన్‌మస్క్ ట్వీట్ వైరల్
Also Read: Redmi Offer: Redmi 9A Sport మొబైల్ పై ప్రత్యేక ఆఫర్.. రూ.349 ధరకే అందుబాటులో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe