elon musk on stock market investment: ప్రపంచ కుబేరుడు ఎలన్‌మస్క్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై విలువైన సూచన ఇచ్చారు. తనను ఎంతోమంది ఈ విషయంలో సలహా అడుగుతున్నారని.. వారికోసమే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. ఎలన్‌మస్క్ సూచనలను ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎలన్‌మస్క్. మస్క్ తలచుకుంటే దేన్నైనా సొంతంచేసుకుంటాడనడానికి ఇటీవల ట్విట్టర్ ఉదంతమే నిదర్శనం. మస్క్ ఇచ్చిన భారీ ఆఫర్ కు తొలుత ముందూ వెనకా ఆడిన ట్విట్టర్ చివరకు దిగిరాక తప్పలేదు. కేవలం రెండేళ్లలోనే వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా ఎదిగిన మస్క్ పై యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. టెస్లా కార్లతో పాటు స్సేస్‌ఎక్స్ మిషన్ అంశాల్లో మస్క్ తీసుకుంటున్న డేరింగ్ డెసిషన్లు ఆయన గ్రాఫ్ ను అమాంతం పెంచేశాయి.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఇప్పుడు యూత్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఏ షేర్లలో పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే అంశాలపై మాత్రం వారికి అవగాహన ఉండటం లేదు. దీనిపై ఎంతో కొంత స్టడీ చేసి పెట్టుబడులు పెట్టినా చాలా మంది చేతులు కాల్చుకుంటున్నారు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులపై ట్విట్టర్‌లో తరచుగా ఎలన్ మస్క్ ను సలహాలు అడుగుతుంటారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో తొలిసారి పెట్టుబడుల విషయంలో సలహా ఇచ్చారు మస్క్. అందరికీ ఓ సింపుల్ సూత్రం చెప్పారు. ప్రోడక్ట్స్ తయారీ, సర్వీసెస్ అందించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. దీనివల్ల ఎర్నింగ్స్ పెరిగే అవకాశముందని తెలిపారు. ఎలన్‌మస్క్ సలహా ఇప్పుడు ట్విట్టర్‌లో విపరీతంగా షేర్ అవుతోంది.
Since I’ve been asked a lot:
Buy stock in several companies that make products & services that *you* believe in.
Only sell if you think their products & services are trending worse. Don’t panic when the market does.
This will serve you well in the long-term.
— Elon Musk (@elonmusk) May 1, 2022
ఎలన్‌మస్క్ సంపాదన 2020 ప్రారంభంలో కేవలం 26 బిలియన్ డాలర్లు మాత్రమే. ఆ తర్వాతే ఆయన ఆదాయం రాకెట్‌లా దూసుకుపోయింది. కరోనా సమయంలోనూ అందరి ఆదాయం తగ్గగా మస్క్ వద్ద మాత్రం భారీగా సంపద పోగుపడింది. ఆ సంవత్సరం చివరి నాటికి మస్క్ వంద బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాడు. 2021 లో మస్క్ వద్ద మరో 90 బిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం ఎలన్‌మస్క్ సంపద 282 బిలియన్ డాలర్లు. మస్క్ తర్వాత కుబేరుడైన అమేజాన్ జెఫ్ బేజోస్ సంపద 183 బిలియన్ డాలర్లు. అంటే ఇద్దరి మద్య వ్యత్సాసం దాదాపు వంద బిలియన్ డాలర్లు. అంటే ఇప్పట్లో మస్క్‌ను కొట్టే మగాడు ఈ భూప్రపంచం మీద లేడన్నమాట.
also read: Gold Dress: బంగారు దుస్తుల్లో మెరిసిపోతున్నపెళ్లి కూతురు... వైరల్ అవుతున్న ఫోటోలు
also read: BOI బ్యాంక్‌లో బంపర్ రిక్రూట్‌మెంట్..స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.