Airtel: ఎయిర్ టెల్ శుభవార్త! ఐపీఎల్ కోసం మూడు సరికొత్త రీఛార్జ్ ప్యాక్ లు అందుబాటులోకి..
Airtel: ఐపీఎల్ ను డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా వీక్షించాలనుకుంటున్నారా..అయితే మీ కోసమే భారతీ ఎయిర్ టెల్ మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్స్ ను తీసుకొచ్చింది.
Airtel: ఐపీఎల్ ప్రేమికులకు భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2021(IPL 2021) సెప్టెంబర్19న తిరిగి ప్రారంభంకాబోతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వీక్షకుల కోసం భారతీ ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్ స్టార్ (hotstar)సబ్ స్క్రిప్షన్లను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్ లను విడుదల చేసింది. దీంతో వినియోగదారులు తమ మొబైల్ ద్వారానే టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. ఈ మూడు కొత్త ప్యాక్(రూ.499, రూ.699, రూ.2798)లను రీఛార్జ్ చేసుకుంటే హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
Also Read: IPL 2021: బీసీసీఐ గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ
రూ.499 ప్లాన్
రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు.
రూ.699 ప్లాన్
రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు.
రూ.2798 ప్లాన్
రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్(Disney+hotstar) ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook