Akash Ambani, Shloka Mehta Welcome Baby Girl: శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. శ్లోకా అంబానీ, ఆకాష్ అంబానీ దంపతులకు ఈ పాప రెండో సంతానం. వీరికి రెండేళ్ల క్రితమే ఒక బాబు పుట్టాడు. తమ కొడుక్కు పృధ్వీ ఆకాష్ అంబానీ తాజాగా మే 31 , బుధవారం నాడు పాప జన్మించింది. ఈ పాప రాకతో తమ కుటుంబం ఒక పరిపూర్ణమైన కుటుంబం అయిందని అంబానీ దంపతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సాధ్యమైనంత వరకు శ్లోకా అంబానీ, ఆకాష్ అంబానీ దంపతులు ఇద్దరూ తమ ప్రైవేట్ లైఫ్ విషయంలో ప్రైవసీ మెయింటేన్ చేస్తున్నప్పటికీ.. ఫేమస్ బిజినెస్ మేన్ ఫ్యామిలీ కావడంతో ఎప్పటికప్పుడు వాళ్లు ఎక్కడికెళ్లినా మీడియా కెమెరాలు వారిని ఫాలో అవుతూనే ఉన్నాయి.. సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ చేస్తూనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ సందర్భంలో తొలిసారిగా శ్లోకా అంబానీ ప్రెగ్నెన్సీతో ఉన్నట్టుగా వెల్లడైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడపాదడపా శ్లోకా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 


శ్లోకా అంబానీకి పాప పుట్టినట్టుగా వార్తలొచ్చిన మరుక్షణం నుంచే ఆకాష్, శ్లోకా దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ బంధువులు, మిత్రులు, వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ సోషల్ మీడియా పోస్టులతో పోటెత్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకాశ్ అంబానీ, శ్లోకా అంబానీలకు జన్మించిన గారాలపట్టికి సంబంధించిన పోస్టులే అధికంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలకు చెందిన నేపథ్యం గురించి, వీళ్ల లవ్లీ వెడ్డింగ్ స్టోరీ గురించే కథనాలు కనిపిస్తున్నాయి.



ఇది కూడా చదవండి : TV, Fridge, Washing Machine Prices: టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ ధరలు మరింత పైకి..


ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబాని, శ్లోకా మెహతాల వివాహం అప్పట్లో పతాక శీర్షికలకెక్కింది. ముఖేష్ అంబానీ తరహాలోనే శ్లోకా మెహతా కుటుంబం కూడా పెద్ద బిజినెస్ మేన్ ఫ్యామిలీనే కావడంతో వీళ్ల పెళ్లి సందడి అంతా ఇంతా కాదు.. అదంతా గతం కాగా.. తాజాగా ముఖేష్ అంబానీ, మెహతా కుటుంబాలు తమ కుటుంబంలోకి కొత్తగా మరొక ఫ్యామిలీ మెంబర్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.


ఇది కూడా చదవండి : CIBIL Score Without Loans: అసలు క్రెడిట్ హిస్టరీనే లేనప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK