Amazon-Flipkart Sales: సెప్టెంబర్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, డిస్కౌంట్ల సందడి, షాపింగ్‌కు రెడీనా
Amazon-Flipkart Sales: పండుగలొస్తున్నాయంటే షాపింగ్ మూడు పెరుగుతుంటుంది. మీ మూడ్‌ను కొనసాగించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది..ఏం కొనాలో ఇప్పట్నించే లిస్ట్ సిద్ధం చేయండి మరి..
Amazon-Flipkart Sales: పండుగలొస్తున్నాయంటే షాపింగ్ మూడు పెరుగుతుంటుంది. మీ మూడ్‌ను కొనసాగించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది..ఏం కొనాలో ఇప్పట్నించే లిస్ట్ సిద్ధం చేయండి మరి..
ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్ ప్రారంభిస్తున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి రెండింటీ సేల్ ప్రారంభమౌతోంది. అమెజాన్ సంస్థ..ది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమై..29 రోజులుంటుంది .ఫ్లిప్‌కార్ట్..బిగ్ బిలియన్ డేస్ 2022 పేరుతో సెప్టెంబర్ 30 వరకూ నడపనుంది.
అమెజాన్ ఇండియాలో 11 లక్షల విక్రేతలు పాల్గొననున్నారని..ఇందులో 2 లక్షల స్థానిక స్టోర్స్ ఉన్నాయని సంస్థ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల తరువాత ఈ సేల్ వస్తోంది. అమెజాన్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనున్న ఈ సేల్..ప్రైమ్ సభ్యులకు మాత్రం 24 గంటలు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఫెస్టివల్ సీజన్‌లో విభిన్న రకాలైన 2 వేలకంటే ఎక్కువ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఎస్బీఐతో జరిగిన ఒప్పందం మేరకు..డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్..అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, మహేంద్ర సింగ్ ధోని వంటి సెలెబ్రిటీలతో బిగ్ బిలియన్ డేస్ ప్రచారం కొనసాగిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వేదికపై 4.2 లక్షల మంది విక్రేతలున్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook