Amazon Bike Discount Offers: ఈ ఆఫర్స్ ఏంట్రా బాబు.. అమెజాన్‌లో మోటర్ సైకిల్స్‌పై రూ.20 వేల తగ్గింపు..
Amazon Bike Discount Offers: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని బైక్‌లు అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. అలాగే వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై ఉన్న ఆఫర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Amazon Bike Discount Offers: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు కొన్ని మొబైల్స్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే అమెజాన్ గత కొంత కాలం నుంచి బైక్‌లను కూడా విక్రయిస్తూ వస్తోంది. అయితే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా కొన్ని బైక్స్ అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా వీటిపై కూడా అమెజాన్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో ఏ బైక్స్ అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి బైక్‌లను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.29750 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇరత ఫ్లాట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా బజాజ్ పల్సర్ 125 నియాన్ డిస్క్ బైక్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ.67,843 కాగా దీనిని ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.14,000 తగ్గింపుతో పొందవచ్చు. అలాగే హీరో XTREME 125R బైక్ పై కూడా ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.18,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ బైక్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,00,566 కాగా ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.18,000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌తో కూడి పేమెంట్ చేస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇక స్కూటర్స్ వివరాల్లోకి వెళితే ఈ సేల్‌లో హీరో ప్లీస్ + ఎక్స్టిఇసిను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.10 వేల తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ రూ. 51,198 ధరతో లభిస్తోంది. అయితే దీనిని ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.9,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే హీరో గ్లామర్ 125 బైక్ ధర రూ.76,848 కాగా దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.81,349 కాగా SBI క్రెడిట్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.14,649 తగ్గింపు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.