iPhone 12 offer: ఐఫోన్ 12పై అమెజాన్‌లో రూ.25 వేల వరకు తగ్గింపు!
యాపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ వేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఐఫోన్ 12పై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ ఫోన్‌పై రూ.25 వేల వరగు తగ్గింపు పొందే వీలుంది.
iPhone 12 offer: యాపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ వేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఐఫోన్ 12పై ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ ఫోన్‌పై రూ.25 వేల వరగు తగ్గింపు పొందే వీలుంది.
ఆఫర్ గురించి ఇలా..
ఐఫోన్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.70,900 వరకు ఉంది. అయితే దీనిపై 13 శాతం (రూ.8,901) తక్షణ డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. అంటే ఫోన్ ధర రూ.61,999కి తగ్గిందన్నమాట.
ఇంకా ఐసీఐసీఐ, సీటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలుగ చేస్తే.. రూ.1,500 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు ఫోన్ ధర రూ.60,499కు తగ్గింతుంది.
వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఇవ్వడం ద్వారా కూడా.. ఐఫోన్ 12పై మరింత తగ్గింపును పొందొచ్చు. అమెజాన్ పోర్టల్ ప్రకారం.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.15,100 వరకు ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అందులో మఖ్యమైనవి ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ క్వాలిటీ, మోడల్ వంటివి. అన్ని సరిగ్గా ఉంటేనే గరిష్ఠ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.
ఒక వేళ ఫోన్‌కు గరిష్ఠ ఎక్స్ఛేంజ్ విలువ లభించినట్లయితే.. ఐఫోన్ 12 ధర రూ. 45,399కు దిగొస్తుంది.
అంటే మొత్తం మీత ఈ ఫోన్‌పై రూ.8,901+రూ.1,500+రూ.15,100=25,501 డిస్కౌంట్ పొందొచ్చు.
నోట్: ఈ ఆఫర్లోని వివరాలు అమెజాన్ పోర్టల్ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఇది పరిమిత కాల ఆఫర్ కావచ్చు. గరిష్ఠంగా ఆఫర్‌ను పొందినప్పుడు మాత్రమే ఫోన్ ధర రూ.45,399కు తగ్గుతుంది.
Also read: LIC Policy: పీఎఫ్ బ్యాలెన్స్‌తో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా?
Also read: BSNL Cheapest Plan: BSNL బంపర్ ఆఫర్.. రూ.49 లకే వాయిస్ కాలింగ్, హైస్పీడ్ డేటా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook