LIC Policy: పీఎఫ్​ బ్యాలెన్స్​తో ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా?

LIC Policy: ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారా? మీకు ఈపీఎఫ్​ ఖాతా కూడా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. పీఎఫ్​ బ్యాలెన్స్​తో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో తెలుసకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 09:55 AM IST
  • పీఎఫ్​ బ్యాలెన్స్​తో ఎల్​ఐసీ ప్రీమియం చెల్లింపు..
  • ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణకూ అవకాశం
  • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి మంచి అవకాశం..
LIC Policy: పీఎఫ్​ బ్యాలెన్స్​తో ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా?

LIC Policy: ఈపీఎఫ్​ఓ ఖాతాదారులు.. ఏదైన కారణం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. వాళ్లకు ఓ గుడ్​ న్యూస్​. ఆర్థిక సమస్యల కారణంగా ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితిలో ఉంటే.. ఈపీఎఫ్​ ఖాతాలోని డబ్బును ఎల్​ఐసీ ప్రీమియం చెల్లింపునకు వాడుకోవచ్చట. పన్నులు, పెట్టుబడుల విభాగంలోని నిపుణుల ప్రకారం... ఎవరి ఈపీఎఫ్​ ఖాతాలో అయితే కనీసం రెండేళ్లకు సరిపపడా ఎల్​ఐసీ ప్రీమియం మొత్తం ఉంటుందో.. అలాంటి ఈపీఎఫ్​ఓ చందాదారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ ప్రీమియం చెల్లించేందుకు ఈపీఎఫ్​ ఖాతాలోని నగదును వాడుకోవచ్చు అని తెలిసింది.

ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ను ఎల్​ఐసీ ప్రీమియం కోసం వినియోగించుకోవడం ఎలా?

ఉద్యోగం కోల్పోవడం లేదా మరే ఇతర కారణాల వల్లనైనా.. ఈపీఎఫ్​ఓ ఖాతాదారులు ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే.. అప్పుడు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా.. ఈపీఎఫ్ఓ ఆఫీస్​ వద్ద ఫారమ్​ 14 దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫారమ్ 14 దాఖలు చేసే సమయానికి ఈపీఎఫ్​ ఖాతాలో ఎల్​ఐసీ ప్రీమియం చెల్లించేందుకు కనీసం రెండేళ్లకు సరిపడా నగదు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అంతకన్నా తక్కువ మొత్తం ఖాతాలో ఉంటే.. ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేరు.
ఈ సదుపాయాన్ని కొత్తగా ఎల్​ఐసీ పాలసీని తీసుకునేటప్పుడు కూడా ఈ సదుపాయం వాడుకోవచ్చు. ఇప్పటికే ల్యాప్స్​ అయిన పాలసీని కూడా పునరద్ధరించుకోవచ్చు.

ఎల్​ఐసీ పాలసీ పునరుద్ధరణ నిబంధనలు..

పాలసీని పునరుద్ధరించేందుకు ఆరు నెలల వరకు ఎలాంటి ఆలస్య రుసుము వసూలు చేయదు ఎల్​ఐసీ. 6 నెలలు దాటి 3 సంవత్సతరాల లోపు పాలసీని పునరుద్ధరిస్తే.. అప్పుడు ప్రీమియంతో పాటు కొంత ఆలస్య రుసుమును వసూలు చేస్తుంది. అంతకు ముంచి పాలసీ ప్రీమియం చెల్లించకుంటే.. అది ఇన్​యాక్టివ్​గా మారుతుంది.

చివరగా..

ఎల్​ఐసీ పాలసీని పునరుద్ధరించేందుకు లేదా ప్రీమియం చెల్లింపునకు ఈపీఎఫ్ ఖాతాల బ్యాలెన్స్​ను వాడుకోవడం అనేది చిట్ట చివరి ఆప్షన్​గా మాత్రమే ఉండాలని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్​ను ఇలా వాడుకోవడం వల్ల.. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్​పై ప్రభావం పడుపతుందని చెబుతున్నారు.

Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ ఫిబ్రవరి 20 బంగారం ధరలు

Also read: AC, Fridges Offers: సమ్మర్ కంటే ముందే వచ్చిన భారీ డిస్కౌంట్స్.. ఈ ఆఫర్స్ పొతే మళ్లీ రావు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News