Tecno Pova 5G Smartphone: అమెజాన్ డీల్ ఆఫ్ ది డే.. టెక్నో పొవా 5జీ స్మార్ట్ ఫోన్‌పై 45 శాతం ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో డీల్ ఆఫ్ ది డే పేరిట పలు రకాల వస్తువులపై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. యాపిల్ ఐఫోన్‌‌తో పాటు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా డిస్కౌంట్‌పై లభిస్తున్నాయి. ఇందులో భాగంగా టెక్నో పొవా 5జీ (8జీబీ, 128 జీబీ) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 45 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంతేనా.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా 90 శాతానికి పైగా తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ అందిస్తున్న డీల్ ఆఫ్ ది డే ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిస్కౌంట్‌తో ఎంత ఆదా అవుతుందంటే..  :


అమెజాన్ అందిస్తున్న డీల్ ఆఫ్ ది డే డిస్కౌంట్ ఆఫర్‌తో కస్టమర్స్‌కు భారీగా డబ్బు ఆదా అవుతుంది. టెక్నో పొవా 5జీ (8జీబీ, 128 జీబీ) స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.28,999. కానీ అమెజాన్ 45 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.15,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని అందిస్తోంది. తద్వారా రూ.13 వేలు వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో చెల్లింపులు జరిపినట్లయితే మరో రూ.1250 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.


అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :


టెక్నో పొవా 5జీ (8జీబీ, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 'విత్ ఎక్స్‌చేంజ్' ఆప్షన్‌పై క్లిక్ చేయగానే 'ఎక్స్‌చేంజ్ చేసే ఫోన్‌ ఎంపిక'అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఏయే ఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుందో తెలుస్తుంది. ఒకవేళ మీరు యూజ్ చేసే స్మార్ట్ ఫోన్ ఆ లిస్టులో ఉన్నట్లయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే మీ ఫోన్ కండిషన్‌ను బట్టే తగ్గింపు ఉంటుంది. పూర్తి ఆఫర్ లభించినట్లయితే గరిష్ఠంగా రూ.15 వేల వరకు తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.15,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.999కే పొందవచ్చు.


డీల్ ఆఫ్ ది డే :


ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే వర్తిస్తుంది. చౌక ధరలో టెక్నో పొవా స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఈరోజే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు రాత్రి 12 గంటలకి ఆఫర్ ముగుస్తుంది.


టెక్నో పొవా 5జీ ఫీచర్స్ : 
6.9 అంగుళాల డిస్‌ప్లే
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ
కనెక్టివిటీ టెక్నాలజీ : Bluetooth, OTG, USB Type C, Wi-Fi
డైమెన్సిటీ ప్రాసెసర్ 900 5జీ ప్రాసెసర్ 
50MP ఏఐ ట్రిపుల్ కెమెరా  బ్యాక్ సెటప్

Also Read: No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?


Also Read: DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలోనే గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై ప్రకటన ఆరోజునే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook