Amazon Summer Sale 2024: ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. షాపింగ్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని హాయిగా ఆన్‌లైన్ షాపింగ్ ఎంజాయ్ చేయండి. అందుకే అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లతో మే 2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభించనుంది. దాదాపు అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు ఇతర వస్తువులపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. మే 2వ తేదీ మద్యాహ్నం నుంచి మాత్రం సమ్మర్ సేల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ సభ్యులకు మాత్రం 12 గంటలు ముందే అంటే మే 1వ తేదీ అర్ధరాత్రి నుంచి వెసులుబాటు ఉంటుంది. అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా OnePlus 12, OnePlus 12R, OnePlus NorD CE, OnePlus Nord3, Samsung Galaxy M34, Samsung Galaxy S23, Samsung Galaxy S24, Redmi Note13 Pro, Redmi 13C, Xiaomi 14, IQoo Z9, Techno Pova6 pro స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఉంటుంది. అమెజాన్ ఇచ్చే తగ్గింపు ఆఫర్ కాకుండా ఇంకా వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ విడిగా ఉంటుంది. ఇందులో ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకులున్నాయి. 


ఐఫోన్ వంటి ప్రీమియం ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ల గురించి ఇంకా ప్రకటన వెలువడలేదు. కానీ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై విడుదలైన టీజర్ ద్వారా ఐఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ఉండవచ్చని అంచనా. వన్‌కార్డ్ క్రెడిట్ లేదా డెబిట్ ద్వారా 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. 


మరో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో మే 3 నుంచి మే 9 వరకూ ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా భారీగా డిస్కౌంట్ ఆఫర్లు అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకూ కొనుగోలు చేయవచ్చు. మొత్తానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ వేదికల ద్వారా సమ్మర్ షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు.


Also read: IT Returns: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన ముఖ్య విషయాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook