Amazon Smart Phone Offers: అమెజాన్ బంపరాఫర్... రూ.8వేలు విలువ చేసే రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.399కే..
amazon Smart Phone Offers: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా... బెస్ట్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా.. అయితే అమెజాన్ మీకు బెస్ట్ ప్లాట్‌ఫామ్..
Amazon Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఇందులో భాగంగా రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్)పై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.6999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.399కే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
డిస్కౌంట్ ఆఫర్ :
రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) సాధారణ ధర రూ.7999. కానీ అమెజాన్‌లో 10 శాతం డిస్కౌంట్‌తో రూ.1000 తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు, హెచ్‌ఎస్‌బీసీ కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే.. రూ.349 వరకు తగ్గింపు లభిస్తుంది. డిస్కౌంట్ మొత్తం పోను రూ.6650కే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్ :
అమెజాన్‌లో రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని మార్చుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.6,600 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.6999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ని అతిచౌకగా రూ.399కే కొనుగోలు చేయవచ్చు.
నో కాస్ట్ ఈఎంఐ :
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేసినట్లయితే నో కాస్ట్ ఈఎంఐ కూడా లభిస్తుంది. నెలకు కేవలం రూ.2333 చొప్పున 3 నెలల పాటు లేదా రూ.1,167 చొప్పున ఆరు నెలల పాటు ఈఎంఐ చెల్లించి ఈ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Pakistan Arms To Adilabad: ఆదిలాబాద్ కు పాకిస్తాన్ నుంచే ఆయుధాలు! ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు
Also Read: Telangana Weather: వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ రెండు రోజులు భారీ వర్షాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook