Telangana Weather: వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ రెండు రోజులు భారీ వర్షాలు...

Telangana Weather: తెలంగాణలో ఈ వారం మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2022, 11:57 AM IST
  • తెలంగాణ వెదర్ రిపోర్ట్
  • గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
  • మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Telangana Weather: వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ రెండు రోజులు భారీ వర్షాలు...

Telangana Weather: తెలంగాణ రాష్ట్రానికి గురు, శుక్ర (జూన్ 9, 10)వారాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. సోమవారం (జూన్ 6) నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని... పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉన్నట్లు పేర్కొంది. పశ్చిమ దిశ నుంచి గంటకు 10-15కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో ఇవాళ 42 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా మెదక్‌లో 25.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది.

రాష్ట్రంలో మంగళ,బుధ (జూన్ 7,8) వారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో వాతావరణంలో పెద్దగా మార్పులేమీ లేవు. ఈసారి నైరుతి రుతుపవనాలు జూన్ 5వ తేదీనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ 1న కేరళను తాకిన రుతుపవనాలు ఆ తర్వాత 4 రోజులకే రాష్ట్రానికి చేరాయి.

Also Read: Telangana SSC Results: ఏపీలో తగ్గిన టెన్త్ ఉత్తీర్ణత.. తెలంగాణ ఫలితాలపై ఉత్కంఠ! రిలీజ్ ఎప్పుడంటే...

Also Read: AP SSC Results: ఉత్తీర్ణత తగ్గడంపై రాజుకున్న రచ్చ... లోకేష్-విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News