Flipkart Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్స్ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. తాజాగా మరోసారి బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్. ఇందులో భాగంగా శాంసంగ్, రియల్‌మీ, జియోమీ, ఒప్పో, ఐఫోన్ తదితర స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్‌లో రూ.23 వేలు విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జీ (ఆక్వా బ్లూ 128 జీబీ) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.15,999కే అందుబాటులో ఉంది. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో ఈ ఫోన్‌ని కేవలం రూ.2499కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
డిస్కౌంట్ ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జీ (ఆక్వా బ్లూ 128 జీబీ) స్మార్ట్ ఫోన్ సాధారణ ధర రూ.22,999. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో 30 శాతం తగ్గింపుతో రూ.15,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ ఫోన్ కొనుగోలుకు మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1 వెయ్యి వరకు తక్షణ డిస్కౌంట్ పొందుతారు. అప్పుడు రూ.14,999కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.2499కే :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జీ (ఆక్వా బ్లూ 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ప్రకారం మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే రూ.12,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు రూ.15,999 విలువ చేసే ఈ ఫోన్ మీకు కేవలం రూ.3,499కే లభిస్తుంది.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై దీని కొనుగోలు చేసినట్లయితే మరో రూ.1 వెయ్యి వరకు తక్షణ తగ్గింపు పొందుతారు. అలా ఈ ఫోన్‌ని మీరు అతి చౌకగా కేవలం రూ.2499కే కొనుగోలు చేయవచ్చు. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్ రేపటి (జూన్ 3) నుంచి ఆదివారం (జూన్ 5) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: Horoscope Today June 2nd 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి జీవిత భాగస్వామి లేదా లవ్‌మేట్‌తో విభేదాలు...A
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook