Amazon Prime Day Sale: ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో ఆఫర్ల పండగ రాబోతోంది. కస్టమర్ల కోసం ఈ నెల 23-24 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో ఎన్నో రకాల వస్తువులపై భారీ తగ్గింపు అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రకటించడంతో చాలామంది ఇప్పటినుంచే ఏమేమి కొనుగోలు చేయాలో ప్లాన్ చేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్ ప్రైమ్ డే సేల్ డేట్, టైమింగ్స్ :


జూలై 23న అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమవుతుంది. జూలై 24వ తేదీ రాత్రి 11.59 గంటలకు ఈ సేల్ ఆఫర్ ముగుస్తుంది. చౌక ధరలో ఫేవరెట్ బ్రాండ్స్‌ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో అమెజాన్ సైట్‌లో ఆ వస్తువులను ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది.


అందుబాటులో ఉండే ఆఫర్లు :


అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉండనుంది. అలాగే ల్యాప్‌టాప్స్, హెడ్ ఫోన్స్‌పై 75 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉండనుంది. ఆయా వస్తువులపై నో కాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇవి మాత్రమే కాదు.. గృహోపకరణాలపై 70 శాతం, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. రూ.99 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ తగ్గింపు లభించనుంది.


అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే :


అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే ప్రైమ్ డే సేల్ ఆఫర్స్ వర్తిస్తాయి. కొత్తగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారికి కూడా ఆఫర్ వర్తిస్తుంది. రూ.1499 ప్యాక్‌తో ఏడాది పాటు రూ.179 ప్యాక్‌తో నెల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 


Also Read: YSRCP Plenary-2022: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి వేళాయే..రెండురోజుల సమావేశాల్లో ఎజెండా ఇదే..!


Also Read: Lord Shiva: సిగెట్ తాగుతున్న శివుడు.. తమిళనాడులో వివాదాస్పద బ్యానర్.. కాళీ పోస్టర్ వివాదం మరవకముందే..  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook