Lord Shiva: సిగెట్ తాగుతున్న శివుడు.. తమిళనాడులో వివాదాస్పద బ్యానర్.. కాళీ పోస్టర్ వివాదం మరవకముందే..

Banner Of Lord Shiva Lighting Cigarette: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఓ జంట పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యానర్ వివాదాస్పదంగా మారింది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 7, 2022, 11:19 AM IST
  • కాళీ పోస్టర్ వివాదం మరవకముందే
  • తెరపైకి మరో వివాదాస్పద బ్యానర్
  • శివుడు సిగరెట్ తాగుతున్నట్లుగా తమిళనాడులో బ్యానర్
Lord Shiva: సిగెట్ తాగుతున్న శివుడు.. తమిళనాడులో వివాదాస్పద బ్యానర్.. కాళీ పోస్టర్ వివాదం మరవకముందే..

Banner Of Lord Shiva Lighting Cigarette: నిన్న కాళీ మాత సిగరెట్ తాగుతున్న పోస్టర్.. ఇప్పుడు శివుడు సిగరెట్ తాగుతున్న బ్యానర్...  కాళీ మాత పోస్టర్ వివాదం ఇంకా సద్దుమణగకముందే తెరపైకి మరో వివాదం పుట్టుకొచ్చింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఇటీవల ఓ జంట పెళ్లి సందర్భంగా వరుడి స్నేహితులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. అందులో కొత్త జంట ఫోటోలు ముద్రించి వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అదే బ్యానర్‌లో శివుడు సిగరెట్ తాగుతున్నట్లుగా ఓ ఫోటోని ముద్రించడం వివాదాస్పదంగా మారింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కన్యాకుమారి జిల్లాలోని అరోకియాపురం గ్రామానికి చెందిన ప్రతీష్ అనే యువకుడికి ఇటీవల పెళ్లి జరిగింది. ప్రతీష్ స్నేహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌లో శివుడు సిగరెట్ తాగుతున్నట్లుగా ఉండటంపై పలు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అరోకియాపురంలో ఏర్పాటు చేసిన ఆ బ్యానర్‌ను తొలగించారు.

ఈ ఘటనకు సంబంధించి పెళ్లి కొడుకుతో పాటు అతని స్నేహితులకు నోటీసులు కూడా జారీ చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వార్నింగ్ ఇచ్చి వారిని వదిలిపెట్టారు. శివుడు సిగరెట్ తాగుతున్నట్లుగా ఉన్న ఆ బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇటీవల ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకురాలు లీనా మణిమెకలై విడుదల చేసిన కాళీ పోస్టర్ ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. ఈ పోస్టర్‌లో కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లుగా చూపించారు. దీనిపై హిందూ సంఘాలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. దీంతో లీనా మణిమెకలై చేసిన  పోస్టును ట్విట్టర్ తొలగించింది. ఆ పోస్టర్‌ను కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో విడుదల చేయడంతో.. అక్కడి నిర్వాహకులు కూడా క్షమాపణలు చెప్పారు. 

Also Read: Chinthamaneni Prabhakar: పటాన్‌చెరులో కోడి పందేలు.. 21 మంది అరెస్ట్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎస్కేప్..

Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల విడుదల..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News