Redmi Smart tv: రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవి ఏకంగా 4 కే రిజల్యూషన్‌తో ఉంటుంది. 3840/2160 పిక్సెల్ కావడంతో మెరుగైన స్క్రీన్ అనుభూతి లభిస్తుంది. అత్యాధునిక వివిడ్ పిక్చర్ ఇంజన్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంది. క్వాడ్ కోర్ కార్టెక్స్ ఎ55 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఇక గేమింగ్ కోసం ప్రత్యేక గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. హెచ్‌డి క్వాలిటీ కావడంతో స్క్రీన్ క్లారిటీ చాలా బాగుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీలో 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ ఉంటుంది. దాదాపు అన్నిరకాల యాప్‌లు సపోర్ట్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, యూట్యూబ్ వంటి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ టీవీ ఎలెక్సా వాయిస్ సపోర్ట్, స్మార్ట్ రిమోట్ ఫీచర్లు ఉంటాయి. అంతేకాకుండా రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ షార్ట్ కట్ బటన్స్ ఉంటాయి. రెడ్‌మి స్మార్ట్ టీవీలో స్పీకర్ క్వాలిటీ బాగుంటుంది. డాల్బీ ఆడియో, డీటీఎస్-హెచ్‌డి, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికొస్తే వైఫై 802, ఎయిర్‌ప్లే 2, మైరాకాస్ట్, బ్లూటూత్ 5.0, హెచ్‌డి‌ఎంఐ పోర్ట్, యూఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం జాక్  ఏర్పాట్లు ఉన్నాయి. 


ఈ ఫోన్ వాస్తవ ధర 42,999 రూపాయలు కాగా 42 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో డిస్కౌంట్ అనంతరం 24,999 రూపాయలకు లభించనుంది. వివిధ రకాల బ్యాంకు ఆఫర్లు ఉపయోగించుకుంటే...మరో 1500 రూపాయలు తగ్గుతుంది. అంటే ఆఫర్లు మినహాయించుకుంటే 23,499 రూపాయలకే లభిస్తుంది.


Also read: Cars Under 5 Lakhs: 25 కిలోమీటర్ల పైగా మైలేజీ నిచ్చే అతి తక్కువ ధరలో లభించే టాప్ 3 కార్స్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook