Cars Under 5 Lakhs: 25 కిలోమీటర్ల పైగా మైలేజీ నిచ్చే అతి తక్కువ ధరలో లభించే టాప్ 3 కార్స్ ఇవే..

Best Mileage Cars Under 5 Lakhs: తక్కువ ధరలోనే లభించే కార్లలో మారుతి ఆల్టో పాటు అనేక రకాల కార్లు ఉన్నాయి. అయితే చాలామంది ఇలాంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం బడ్జెట్లో అతి తక్కువ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మూడు కార్ల గురించి తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 26, 2024, 02:12 PM IST
Cars Under 5 Lakhs: 25 కిలోమీటర్ల పైగా మైలేజీ నిచ్చే అతి తక్కువ ధరలో లభించే టాప్ 3 కార్స్ ఇవే..

Best Mileage Cars Under 5 Lakhs: అతి తక్కువ ధరలోని మంచి మైలేజీని ఇచ్చి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? భారతీయ కస్టమర్స్ కోసం అనేక రకాల ఆటోమొబైల్ కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్లలో కార్లను విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మైలేజీ, తక్కువ చాలా ఆటో మొబైల్ కంపెనీలు మార్కెట్లోకి అనేక కార్లను లాంచ్ చేశాయి. అయితే ఇలాంటి జాబితాలోనే మారుతి ఆల్టో k10, టాటా పంచ్ లాంటి అనేక బ్రాండ్లకు సంబంధించిన కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షల కంటే తక్కువలోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇవన్నీ దాదాపు లీటర్ కు 25 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి. అలాగే అనేక రకాల ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే ఇలాంటి జాబితాలోకి వచ్చే మూడు కార్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 

మారుతి ఆల్టో K10 (Maruti Alto K10):
 మారుతి సుజుకి ఆల్టో కార్ల గురించి చెప్పనక్కర్లేదు. ఈ కార్లు భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందాయి. అంతేకాకుండా మిడిల్ క్లాస్ బడ్జెట్ కార్లగా గొప్ప పేరు సంపాదించుకున్నాయి. అయితే మారుతి సుజుకి ఆటోమొబైల్ కంపెనీ వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త వేరియంట్లలో విడుదల చేస్తూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి K10 టెన్ కారు ధర రూ. 3.99 లక్షలుగా ఉంది. ఈ కారు వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వ్రియంట్లకు మార్కెట్లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన మైలేజ్ వివరాల్లోకి వెళితే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ 24.39 kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 24.90 kmpl మైలేజ్ ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

మారుతీ S-ప్రెస్సో (Maruti Suzuki S Presso):
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో లాంచ్ అయిన మారుతీ S-ప్రెస్సో కారుకు మంచి గుర్తింపు లభించింది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడంతో మిడిల్ రేంజ్ బడ్జెట్ కస్టమర్ ఎక్కువగా ఈ కారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలు కాగా ప్రత్యేకమైన ఆఫర్స్‌లో మరింత తగ్గింపు ధరకే పొందవచ్చు. ఇక ఈ కార్లకు సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ కలిగిన కారు 24.12 kmpl మైలేజీని అందిస్తుంది. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 25.30 kmpl మైలేజీని ఇస్తుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
ఇటీవలే అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో రెనాల్ట్ క్విడ్ ఒకటి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అనేక రకాల శక్తివంతమైన స్పెసిఫికేషన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. సేఫ్టీ పరంగా కూడా ఈ కారు చాలా బాగుంటుంది. ఇక ఈ కారుకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే..రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక మైలేజీ వివరాల్లోకి వెళితే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్  కలిగిన రెనాల్ట్ క్విడ్ 21.7 kmpl మైలేజీని ఇస్తే, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 22 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News