Amazon Sale: అమెజాన్ స్పెషల్ ఆఫర్- వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై రూ.16,400 వరకు తగ్గింపు!
Amazon Sale: వన్‌ప్లస్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నార్డ్ సీఈ2 5జీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పరిమిత కాలం అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ పూర్తి వివరాలు మీకోసం.
Amazon Special discount up to Rs 16400 on OnePlus Nord CE 2 5G: అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లపై రికార్డు స్థాయిలో తగ్గింపు ప్రకటించింది. పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ పై అమెజాన్ ఆఫర్లు..
స్పెషల్ ఆఫర్లో భాగంగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించింది అమెజాన్. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈ ఆఫర్‌తో పాటు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది అమెజాన్. ఈ ఆఫర్‌ను కూడా కలిపితే.. ఫోన్ ధర రూ.22,499కు చేరుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌ను.. ఇవ్వడం ద్వారా రూ.14,900 లభించనుంది. అంటే ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండీషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ విలువను అమెజాన్ నిర్ణయిస్తుంది. ఒకవేళ ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్‌కు పూర్తి విలువ (రూ.14,900) లభిస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 ఫోన్‌ను రూ.7,599కే సొంతం చేసుకోవచ్చు.
నోట్: ఈ ఫోన్‌కు సంబంధించిన ఆఫర్ వివరాలను అమెజాన్ వెబ్సైట్ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఫోన్ కొనేముందు ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ ఫీచర్లు..
6.43 అంగుళాల ఆమోల్డ్, ఫఉల్ హెచ్డీ డిస్ప్లే (గొరిళ్లా గ్లాస్ ప్రొటెక్షన్)
మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్
వెనుకవైపు మూడు కెమెరాలు (64 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
65 వాట్స్ పాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 11 ఓఎస్
Also read: BSNL Discount Offer: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్.. ఆ రీచార్జ్ ప్లాన్స్‌పై డిస్కౌంట్..
Also read: Flipkart Electronics Sale: ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్- రూ.14,999కే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook