BSNL Discount Offer: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్.. ఆ రీచార్జ్ ప్లాన్స్‌పై డిస్కౌంట్..

BSNL Discount offer: బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ 4 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 02:56 PM IST
BSNL Discount Offer: బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్.. ఆ  రీచార్జ్ ప్లాన్స్‌పై డిస్కౌంట్..

BSNL Discount offer: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ మొబైల్ యాప్ సెల్ఫ్‌కేర్ ద్వారా రీఛార్జ్ చేసుకునేవారికి ప్రీప్రెయిడ్ ప్లాన్‌పై 4 శాతం తగ్గింపును అందిస్తోంది. మార్చి 31, 2022 వరకు చేసుకునే రీచార్జ్ ప్లాన్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా రూ.201 లేదా అంతకన్నా ఎక్కువ రీచార్జ్ ప్లాన్లకే ఇది వర్తిస్తుంది.

థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే రీచార్జ్‌లకు ఆఫర్ వర్తించదు :

ఈ ఆఫర్ సెల్ఫ్‌కేర్ యాప్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. Google Pay, PhonePe, ఇతర థర్డ్ పార్టీ మొబైల్ యాప్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకునేవారికి ఇది వర్తించదు. బీఎస్ఎన్‌ఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రతీ ప్లాన్ సెల్ఫ్ కేర్ యాప్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు.. సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ఒక కస్టమర్ రూ.201 రీచార్జ్ చేసుకుంటే.. అతనికి రూ.8.04 మేర డిస్కౌంట్ లభిస్తుంది.

10 లక్షల మందికి పైగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు :

ఇప్పటికే 10 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు సెల్ఫ్ కేర్ యాప్‌ను వాడుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో ఈ యాప్ అందుబాటులో ఉంది. సెల్ఫ్ కేర్ యాప్ యూజర్స్‌ను పెంచే ఉద్దేశంలో భాగంగానే బీఎస్ఎన్ఎల్ తాజా ఆఫర్‌ను తీసుకొచ్చింది.

బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ గూగుల్ ప్లే స్టోర్‌లో 4.4 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది లైట్ అప్లికేషన్ కావడంతో దీనికి ఎక్కువ డేటా వినియోగం కూడా ఉండదు. ఈ యాప్ ద్వారా రీఛార్జ్‌తో పాటు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్నేహితులు, బంధువులకు కూడా రీచార్జ్‌లు చేయవచ్చు. 

Also Read: Bheemla Nayak Collection: రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'!

Also read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News