Flipkart Electronics Sale: ఫ్లిప్​కార్ట్ సూపర్​ ఆఫర్​- రూ.14,999కే వన్​ప్లస్ స్మార్ట్​ టీవీ!

Flipkart Electronics Sale: స్మార్ట్​ టీవీలపై ఫ్లిప్​కార్ట్​ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్ సేల్​లో భాగంగా ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు బ్యాంక్​ ఆఫర్లు కూడా ప్రకటించింది ఫ్లిప్​కార్ట్. ఈ ఆఫర్​కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 01:38 PM IST
  • ఫ్లిప్​కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్​ నేటితో ముగింపు
  • స్మార్ట్​ టీవీలపై బంపర్ ఆఫర్లు..
  • బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తింపు!
Flipkart Electronics Sale: ఫ్లిప్​కార్ట్ సూపర్​ ఆఫర్​- రూ.14,999కే వన్​ప్లస్ స్మార్ట్​ టీవీ!

Flipkart Electronics Sale: ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్​ సేల్​ నిర్వహిస్తోంది. ఈ నెల 23న ప్రారంభమైన ఈ సేల్.. నేటి అర్ధరాత్రితో (ఫిబ్రవరి 28న) ముగియనుంది. సేల్ చివరి రోజు కావడంతో ఫ్లిప్​కార్ట్​ అదిరే ఆఫర్లను ప్రకటించింది.

ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది ఫ్లిప్​కారక్ట్​. 32 అంగుళూల సైజు మొదలుకుని 65 అంగుళాల భారీ టీవీలపై భారీ తగ్గింపు ఇస్తోంది. సేల్ డిస్కౌంట్​తో పాటు.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్​ కార్డ్, డెబిట్​ కార్డ్​ సహా వివిధ కార్డులద్వారా చెల్లింపులు జరిపే వారికి 10 శాతం క్యాష్​ బ్యాక్ లభిస్తుందని వెల్లడించింది.

కొన్ని టీవీలపై ఆఫర్లు ఇలా..

వన్​ ప్లస్​ వై1 సిరీస్​ 32 అంగుళాల టీవీపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఈ స్మార్ట్​టీవీ అసలు ధర రూ.21,999గా ఉంది. కాగా.. 25 శాతం డిస్కౌంట్​తో దీనిని రూ.16,499కి విక్రయిస్తోంది ఫ్లిప్​కార్ట్​. వీసా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు జరిపితే ఈ టీవీ ధర మరో రూ.1,500 తగ్గనుంది. అప్పుడు ఈ టీవీని రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు.

వీటితో పాటు.. రియల్​మీ, రెడ్​మీ వంటి బడ్జెట్ స్మార్ట్ టీవీలు, శాంసంగ్​, ఎల్​జీ, సోనీ వంటి టీవీలపై కూడా ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

వన్​ ప్లస్​ వై1 ఫీచర్లు..

ఈ స్మార్ట్ టీవీ 2022లో విడుదలైంది. డ్యూయల్ బాండ్ వైఫై సపోర్ట్ ఉంది. 1366x768 రెజల్యూషన్ హెచ్​డీ క్వాలిటీ పొందిపరిచింది వన్​ప్లస్​.

నెట్​ఫ్లిక్స్​, డిస్నీ+ హాట్​స్టార్​, యూట్యూబ్ వంటి యాప్​లను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్​, బిల్ట్​ ఇన్​ క్రోమ్​కాస్ట్​ ఫీచర్లు ఉన్నాయి.

20 వాట్స్ సౌండ్ అవుట్​పుట్​, 60 హెచ్​జెడ్​ రీఫ్రెష్​ రేట్​తో ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి వస్తుంది.

Also read: SGB 2021-22: పదవ విడత గోల్డ్ బాండ్లు అందుబాటులోకి.. గ్రాము బంగారం ధర ఎంతంటే?

Also read: Flipkart Smartphone Offer: రూ.17,000 విలువైన Motorola స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.451లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News