Amazon Summer Sales: మీకు కొత్తగా 5జి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే అమెజాన్ సమ్మర్ ఆఫర్ నడుస్తోంది. 25 వేల రూపాయల ఫోన్ మీకు కేవలం 7 వేల రూపాయలకే లభించనుంది. ఎలాగో తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రఖ్యాత ఆన్‌లైన్ షాపింగ్ వేదిక అమెజాన్‌లో ఇప్పుడు సమ్మర్ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌‌ఫోన్లపై మంచి మంచి ఆఫర్లున్నాయి. ముఖ్యంగా ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగా iQOO Z3 5G మీకు చాలా తక్కువ ధరకే లభించనుంది. ఈ డీల్‌లో ఉన్న ఆఫర్లు ఏంటనేది తెలుసుకుందాం..


iQOO Z3 5G పై భారీ డిస్కౌంట్


ఇండియాలో iQOO Z3 5G స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ ప్రైస్ 24 వేల 999 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ సమ్మర్ సేల్‌లో 16 శాతం డిస్కౌంట్ ఉది. అంటే ఈ ఫోన్ డిస్కౌంట్ తరువాత 20 వేల 990 రూపాయలకు లభించనుంది. ఈ డీల్‌లో మీకు లభించే డిస్కౌంట్ కూపన్ ద్వారా మరో 2 వేల రూపాయలు తగ్గుతుంది. 18 వేల 990 రూపాయలకు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వినియోగిస్తే మరో 15 వందల రూపాయలు తగ్గుతుంది. దాంతోపాటు మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌లో ఇస్తే..మరో 10 వేల 4 వందల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ ఫోన్ మీకు 7 వేల 90 రూపాయలకు వచ్చేస్తుంది.


iQOO Z3 5G ఫీచర్లు


ఈ స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 768 జి ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రేష్ రేట్ 180 హెచ్‌జెడ్ టచ్ శాంపిలింగ్ రేట్ ఉంటుంది.  55 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఫలితంగా 19 నిమిషాల్లో 50 శాతం వరకూ ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 ఎంబీ మయిన్ సెన్సార్ కెమేరా ఉంటుంది.


Also read: రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పడరాని పాట్లు పడుతున్న యూరప్ దేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.