Amul hikes milk prices: 'అమూల్' (Amul) బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) పాల ధరలను లీటరుకు రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు నేటి నుండి (మార్చి 1, 2022) దేశమంతటా అమలులోకి వస్తాయి. తాజా రేట్ల ప్రకారం, గుజరాత్‌లోని అహ్మదాబాద్ మరియు సౌరాష్ట్ర రీజియన్‌లలో అమూల్ గోల్డ్ ధర 500 మి.లీ రూ. 30, అమూల్ తాజా 500 మి.లీ రూ. 24, అమూల్ శక్తి 500 మి.లీ రూ. 27గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది జూలైలోనే అమూల్ పాల ధరలను జీసీఎంఎంఎఫ్ (Gujarat Cooperative Milk Marketing Federation) కంపెనీ పెంచింది. ఏడాది కూడా పూర్తికాకుండానే మళ్లీ ధరలు పెంచనుంది. ఈ పెంచిన ధరలు అమూల్ మిల్క్‌కు చెందిన అన్ని బ్రాండ్లకు వర్తించనున్నాయి. విద్యుత్ ఖర్చులు, ప్యాకేజింగ్ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టేషన్, యానిమల్ ఫీడ్‌కు చెందిన ధరలు పెరగటంతోనే..పాల ధరలు పెచంచాల్సి వచ్చిందని జీసీఎంఎంఎఫ్ పేర్కొంది. లీటరుకు రూ. 2 పెరగడమంటే ఎంఆర్పీలో నాలుగుశాతం పెరుగుదల అని అందరూ గమనించాలి. 


Also Read: Smartphones scheme: రైతులకు గుడ్​ న్యూస్​- స్మార్ట్​ఫోన్ కొంటే రూ.6000 సాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook