Smartphones scheme: రైతులతు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్మార్ట్‌ఫోన్ కొనేందుకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గత వారమే ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించారు. గుజరాత్ స్మార్ట్‌ఫోన్ సబ్సిడీ యోజన కింద ఈ సహాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాలలు కన్న డిజిటల్ విప్లవంలో భాగంగా.. రైతులు కూడా డిజిటల్ సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా గత బుధవారం గాంధీనగర్‌లోని 33 మంది రైతులకు రూ.1.84 లక్షల సబ్సిడీ అందించినట్లు వివరించింది.
ఇక ఈ పథకం గురించి మీడియాతో మాట్లాడిన.. గుజరాత్ వ్యవసాయ మంత్రి రాఘవ్జీ పటేల్.. ఇప్పటి వరకు ఈ పథకం కింద స్మార్ట్‌ఫోన్ సబ్లిడీ కోసం 40,016 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వివరించారు. స్మార్ట్ ఫోన్ విలువలో 40 శాతం (గరిష్ఠంగా రూ.6,000) భరించనున్నట్లు వివరించారు. రూ.15,000 ఫోన్ కొనుగోలు చేస్తే అందులో రూ.6000 ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు, పంటకు సంబంధించి వివరాలను తెలియజేయడం వీలవుతుందని చెప్పుకొచ్చారు మంత్రి.
ఈ పథకం గుజరాత్లో వ్యవసాయ భూమి ఉన్న ఎవరికైనా వర్తిస్తుందని స్పష్టం చేశారు మంత్రి రాఘవ్జీ పటేల్. అర్హులు https://ikhedut.gujarat.gov.in వెబ్సైట్లోకి వెళ్లి.. అందులో అడిగిన వివరాలను నింపాలి. దీని ద్వారా ప్రభుత్వం ఆ దరఖాస్తును రివ్యూ చేసి.. అర్హులైన వారికి సబ్సిడీ అందిస్తుందని వివరించారు.
Also read: Narendra Modi: కాశీలో నా చావు కోసం ప్రార్థించారు... సంతోషమే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
Also read: Corona Fourth Wave: జూన్ నుంచి కరోనా ఫోర్త్‌వేవ్, ఆగస్టులో పీక్స్, కాన్పూర్ ఐఐటీ తాజా అధ్యయనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook