Bank Holidays in April 2023: ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. దీంతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరంలో అనేక మార్పులు జరగనున్నాయి. ఇక ఈసారి ఏప్రిల్‌లో కూడా బ్యాంకులకు చాలా సెలవులు రానున్నాయి. మీకు బ్యాంకులకు సంబంధించిన పని ఉంటే.. ఆయా తేదీలను గుర్తు పెట్టుకుని ముందే పూర్తి చేసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. అంటే బ్యాంకుల్లో పని పూర్తి చేయడానికి మీకు 15 రోజులు మాత్రమే లభిస్తాయి. ఈసారి ఏప్రిల్‌లో మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి, వార్షిక ముగింపు వంటి సెలవులు ఉంటాయి. దీంతో పాటు శని, ఆదివారాల్లో వారానికోసారి సెలవులు కూడా ఉంటాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2023లో బ్యాంక్ హాలిడే జాబితాను విడుదల చేసింది. 


ఏప్రిల్‌లో బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోకపోతే మీరు ఇబ్బండి పడే అవకాశం ఉంటుంది. మీకు బ్యాంకు పనులుంటే సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. బ్యాంక్‌లో చెక్కు జమ చేయడం, డబ్బు తీసుకోవడం, పాస్‌బుక్ లేదా చెక్ బుక్ తీసుకోవడం వంటి ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటే ముందే కంప్లీట్ చేసుకోండి. బ్యాంక్ హాలిడే సమయంలో‌ మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సౌకర్యాల ద్వారా మీరు పని చేసుకోవచ్చు. 


ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇలా..


==> ఏప్రిల్ 1: బ్యాంకుల వార్షిక మూసివేత ఉంటుంది. ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, చండీగఢ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
==> ఏప్రిల్ 2: ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
==> ఏప్రిల్ 4: మహావీర్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీలలో బ్యాంకులు సేవలు నిలిచిపోనున్నాయి.
==> ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 
==> ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే కారణంగా అగర్తల, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే.
==> ఏప్రిల్ 8: నెలలో రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
==> ఏప్రిల్ 9: ఆదివారం సెలవు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
==> ఏప్రిల్ 14: బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీ డే ఉంటుంది. 
==> ఏప్రిల్ 15: విషు, బోహాగ్ బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తల, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. 
==> ఏప్రిల్ 16: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు.
==> ఏప్రిల్ 18: షాబ్-ఎ-కద్రాలో జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే. 
==> ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ కారణంగా అగర్తల, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురంలో బ్యాంకులు బంద్.  
==> ఏప్రిల్ 22: నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. 
==> ఏప్రిల్ 23, 2023: ఆదివారం బ్యాంకులకు సెలవు.  
==> ఏప్రిల్ 30, 2023: ఆదివారం కారణంగా బ్యాంకులకు హాలీ డే.


Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?   


Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కథ ముగిసే.. మూడో వన్డేలోనూ గోల్డెన్ డక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి