Union Budget 2023: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను సమర్పించనుంది. వివిధ రంగాలకు చెందిన వారు తమకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రకటనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల సంస్థ అసోచామ్ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో ప్రభుత్వానికి ముఖ్యమైన డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపుతుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని పెంచాలని అసోచామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే పన్ను చెల్లింపుదారులు ప్రయోజనం పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని అసోచామ్ ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచినట్లువుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం ఏటా రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించడం లేదు. అదేసమయంలో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షిక ఆదాయంపై రాయితీ లభిస్తుంది.


అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటిలోనూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడానికి ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని అన్నారు. భారతదేశం ప్రధాన ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించేందుకు కృషి చేస్తున్నందున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మద్దతుగా ఇతర దేశాలు తీసుకుంటున్న క్రియాశీల చర్యలకు ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలని చెప్పారు.


ప్రస్తుతం ఏడాదికి రూ.2.50 లక్షల వరకు మొత్తం ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉందని ఆయన తెలిపారు. అయితే ఒక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే.. మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలు మినహా పన్ను విధిస్తుందన్నారు.
ఉద్యోగాన్ని పెంచడానికి, హరిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, స్థిరమైన హరిత పరిశ్రమలపై దృష్టి పెట్టాలని సూచించారు. తయారీ భద్రత కంటే ఆర్థిక భద్రత పెద్దదని అన్నారు. హరిత ఆర్థిక వ్యవస్థను అనుసరించడం, ఇంధన స్వాతంత్ర్యం సాధించడం, హరిత పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ఇవన్నీ స్వావలంబన దిశగా అడుగులని చెప్పారు.


అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ మాట్లాడుతూ.. వినియోగదారుల చేతుల్లో ఎక్కువ డబ్బును వదిలివేయడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించడం ఆర్థిక వృద్ధిలో మరింత మెరుగుదల కోసం మంచి నిర్ణయమని అన్నారు. ఆర్థిక వినియోగంతో పాటు స్థిరమైన అభివృద్ధి ఇతర మార్గం పెట్టుబడిని మరింత ప్రోత్సహించినట్లవుతుందన్నారు. తయారీ రంగంలో కొత్త పెట్టుబడి కోసం 15 శాతం కార్పొరేట్ పన్ను రేటు సేవలతో సహా అన్ని రంగాలలో వర్తించవచ్చని ఆయన తెలిపారు.


Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా  


Also Read: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలు, రాళ్లతో వైసీపీ-టీడీపీ నేతల పరస్పర దాడి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook