Atal Pension Yojana: అయితే ఈ అటల్ పెన్షన్ యోజనకు కొన్ని అర్హతలున్నాయి. ట్యాక్స్ పేయర్ కాని వారెవరరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. కావల్సిన వయస్సు 18 నుంచి 40 ఏళ్లు. 60 ఏళ్ల తరువాత పెన్షన్ అందుతుంది. ఈ ప్రభుత్వ పధకంలో నెలకు 1000 నుంచి 5000 వరకూ పెన్షన్ అందుకోవచ్చు. అయితే ఈ పధకం మధ్యలో డబ్బులు విత్‌డ్రా చేయగలమా అనేది విషయం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పధకంలో ఎక్కౌంట్ హోల్డర్ మధ్యలో ఎదైనా చికిత్స కోసం డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే ఆ తరువాత మళ్లీ ఎక్కొంట్ కొనసాగించేందుకు వీలుండదు. ఈ పరిస్థితి వస్తే మొత్తం విత్‌డ్రా చేయాల్సిందే. మీరు విత్‌డ్రా చేసే సమయానికి మీ పెట్టుబడికి ప్రభుత్వం జత చేసే నగదుతో కలిపి మీ ఎక్కౌంట్‌కు చేరుతుంది. 


ఏ కారణం లేకుండా 060 ఏళ్ల కంటే ముందే స్కీమ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఆ ఎక్కౌంట్‌కు సంబంధించి కొంత నగదు ఛార్జెస్ రూపంలో కట్ అవుతుంది. అయితే ప్రభుత్వపరంగా అందే ప్రయోజనాలేవీ అందవు. 


అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేయాలంటే ముందుగా బ్యాంక్‌లో సేవింగ్ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి. ఇంతకుముందే బ్యాంక్ సేవింగ్ ఎక్కౌట్ ఉంటే అదే బ్యాంక్ నుంచి ఈ స్కీమ్ అప్లికేషన్ తీసుకోవాలి.పేరు, వయస్సు, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ వంటి వివరాలు సరిగా నమోదు చేయాలి. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలి. మీ డాక్యుమెంట్లు వెరిఫై చేశాక అటల్ పెన్షన్ యోజన ఓపెన్ అవుతుంది.


Also read: PPF and SSY New Rule: ఈ తేదీలోగా కనీస బ్యాలెన్స్ లేకుంటే ఆ రెండు ఎక్కౌంట్లు క్లోజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook