Ather 450S Electric Scooter Price & Range: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ, విక్రయాల్లో టాప్ ప్లేయర్స్ లో ఒకటిగా దూసుకుపోతున్న ఎథర్ ఎనర్జీ తాజాగా 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త వేరియంట్ అయినటువంటి ఎథర్ 450Sని లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ప్రారంభ ధర సబ్సిడీని మినహాయించి కేవలం రూ. 129,999 మాత్రమే అని ఎథర్ ఎనర్జీ స్పష్టంచేసింది. చాలామంది ప్రయాణికులు కోరుకునే పనితీరు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొచ్చే లక్ష్యంతోనే Ather 450S లాంచ్ చేసినట్టు ఎథర్ ఎనర్జీ ప్రకటించింది. 450S 3 kWh బ్యాటరీ ప్యాక్, ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం ఒక్కసారి చార్జ్ చేస్తే 115 కి.మీ రేంజ్, గంటకు 90 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

125 సీసీ పనితీరు కలిగిన స్కూటర్లను కొనుగోలు చేస్తున్న ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టినట్టు ఎథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టంచేసింది. జూన్ 1, 2023 నుండి వర్తించే ఫేమ్ II సబ్సిడీ రివిజన్‌ను అనుసరించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసిన ఎథర్ ఎనర్జి.. అందుకు తగినట్టుగానే ఈ స్కూటర్ల ధరలను కూడా నిర్ణయించింది. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం గణనీయంగా పెరిగిపోయేందుకు కారణమైన అంశాల్లో ఒకటైన ఫేమ్ II సబ్సిడీ, ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 15 శాతం వరకు పరిమితితో kWhకి రూ. 10,000 వరకు సవరించబడింది. 


ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్ అయినటువంటి ఎథర్ 450X ఎక్స్-షోరూమ్ ( బెంగళూరులో ) ధర రూ. 145,000 కాగా 450X ప్రో ప్యాక్ ఎక్స్-షోరూమ్ ( బెంగుళూరులో ) ధర రూ. 165,000 గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎథర్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లలో జూలై నుండి కొత్త ఎథర్ 450S బుకింగ్స్ షురూ కానున్నాయి. అంతేకాకుండా ఎథర్ ఎనర్జీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ కస్టమర్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.


ఇది కూడా చదవండి: Cheapest Bike: డెడ్‌ ఛీప్‌ ధరలతో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌ ఇదే..లీటర్‌కు మైలేజీ ఎంతిస్తుందో తెలుసా?


ఎథర్ ఎనర్జీ కో ఫౌండర్ కమ్ సీఈఓ అయిన తరుణ్ మెహతా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుతూ, " 450 సిరీస్ వెహికిల్స్ తమకు చాలా సక్సెస్‌ఫుల్ వెంచర్ అని.. ఇంకెంతోమంది కస్టమర్లకు దీనిని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం " అని స్పష్టంచేశారు. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి రావాలని చూస్తున్న వారికి  తమ ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన 450S బెస్ట్ ఛాయిస్ అవుతుందని అన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్స్ కేటగిరీలో, 450S కొత్త పుంతలు తొక్కుతుందని.. పెర్ఫార్మెన్స్ స్కూటర్ సెగ్మెంట్‌లో మొట్టమొదటిసారిగా ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా హైటెక్ ఫీచర్స్‌ని అందిస్తోంది, పర్ఫార్మెన్స్‌, రైడింగ్ జాయ్, సేఫ్టీ పరంగా స్టాండర్డ్స్ పెంచుతుంది అని పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : Dr Subhash Chandra: త్వరలో ఎస్సెల్ గ్రూప్‌కు అప్పుల నుంచి విముక్తి
ఇది కూడా చదవండి : LPG Cylinder Price Cut: నేటి నుంచి కొత్త రూల్స్ అమలు.. గ్యాస్ రేటు తగ్గింపు.. ఆ ధరలు పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook