Dr Subhash Chandra: త్వరలో ఎస్సెల్ గ్రూప్‌కు అప్పుల నుంచి విముక్తి

Dr Subhash Chandra: ఎస్సెల్ గ్రూప్ త్వరలో రుణాల నుంచి విముక్తి కానుందని ఆ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర వెల్లడించారు. జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వికు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 1, 2023, 01:21 PM IST
  • త్వరలో ఎస్సెల్ గ్రూప్‌కు రుణాల నుంచి విముక్తి, ఆస్థుల విక్రయంతో రుణాల చెల్లింపు
  • ఇప్పటి వరకూ 40 వేల కోట్ల రుణాలు 50 వేల కోట్ల వడ్డీ చెల్లింపు పూర్తి
  • జీ బిజినెస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర
Dr Subhash Chandra: త్వరలో ఎస్సెల్ గ్రూప్‌కు అప్పుల నుంచి విముక్తి

Dr Subhash Chandra: ఎస్సెల్ గ్రూప్ భవిష్యత్ ప్రణాళికలు, ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాల గురించి ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర కూలంకషంగా వివరించారు. జీ బిజినెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలకమైన పలు అంశాలను వివరించారు. త్వరలోనే ఎస్సెల్ గ్రూప్ రుణవిముక్తి అవుతుందన్నారు. 

ఆస్థుల్ని విక్రయించడం ద్వారా రుణాల్నించి విముక్తి పొందడమే లక్ష్యమని..ఇప్పటి వరకూ 40 వేల కోట్లను రుణదాతలకు తిరిగి చెల్లించామని ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర వివరించారు. త్వరలోనే ఎస్సెల్ గ్రూప్ రుణాల్నించి ఉపశమనం పొందుతుందన్నారు. 50 వేల కోట్ల వడ్డీ కూడా చెల్లించినట్టు స్పష్టం చేశారు. కంపెనీకు చెందిన విలువైన ఆస్థుల్ని విక్రయించడం ద్వారా ఎస్సెల్ గ్రూప్ రుణాన్ని రీ పే చేశామన్నారు. ఆఖరికి తన ఇంటిని కూడా తాకట్టు పెట్టానని డాక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. ప్రతి ఒక్కరి రుణాన్ని తిరిగి చెల్లిస్తానని మాట ఇస్తున్నట్టు చెప్పారు. 

ప్రస్తుతం డిష్ టీవీ రుణవిముక్తి పొందిందని..జీ ఎంటర్‌ప్రైజస్-సోనీ విలీన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని డాక్టర్ సుభాష్ చంద్ర చెప్పారు. ఇటీవల తాను స్టార్టప్‌లను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఆయన ప్రస్తావించారు. బలమైన వ్యక్తి ఎప్పుడూ సమస్యల్నించి పారిపోకుండా వాటితో పోరాడతాడని, జీవితంలో కష్టకాలం తనకు చాలా నేర్పిందని డాక్టర్ సుభాష్ చంద్ర వివరించారు.

రుణాల చెల్లింపు ఎప్పుడు ప్రారంభం

97 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు. ఎస్సెల్ గ్రూప్ రుణాల చెల్లింపును 2019 జనవరిలో ప్రారంభించిందన్నారు. 2023 మార్చ్ 31 నాటికి ప్రతి రుణాన్ని చెల్లించాలనేది తమ లక్ష్యమన్నారు. అయితే కొన్ని కారణాలతో కొన్ని ఆస్థుల విక్రయం జరగనందున అది అమలు కాలేకపోయిందన్నారు. అయితే మరి కొన్ని ఆస్థుల విక్రయానికి అవకాశముందని..ఆ ప్రక్రియతో రుణాలు తిరిగి చెల్లించేస్తామని స్పష్టం చేశారు. 

తన అప్పులపై కొందరు రుణదాతలు సృష్టిస్తున్న వివాదాల గురించి కూడా డాక్టర్ సుభాష్ చంద్ర స్పందించారు. రుణదాతలు ఎస్సెల్ గ్రూప్‌కు చాలా మద్దతుగా నిలిచారని, అయితే విలువైన ఆస్తుల్ని విక్రయించి మరీ రుణాల్ని తిరిగి చెల్లించిందనే విషయం కూడా వారికి తెలుసన్నారు. 1967 నుంచి 2019 వరకూ ఎస్సెల్ గ్రూప్ ఎప్పుడూ డీఫాల్ట్ చేయలేదని గుర్తు చేశారు. 

Also read: Diesel Cars: 10 లక్షల కంటే తక్కువకు లభించే టాప్ 5 డీజిల్ కార్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News