Bajaj Chetak EV 2024: పాత మోడల్లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ చూడండి!
Bajaj Chetak Electric Scooter 2024 Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
Bajaj Chetak Electric Scooter 2024 Price: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ బజాజ్ త్వరలోనే మరో గుడ్ న్యూస్ తెలపబోతోంది. త్వరలోనే అతి శక్తివంతమైన బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. మార్కెట్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్‌ను అతి త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫోటోస్, ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అంతేకాకుండా దీనిని నీలి రంగులో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బజాజ్ దీనిని అతి తక్కువ ధరలోనే లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ బైక్ చూడడానికి అచ్చం పాత చేతక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది అనేక ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ ఎలక్ట్రిక్ బజాజ్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్:
ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీని డిజైన్ వివరాల్లోకి వెళితే, ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా క్లాసిక్ ఓల్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు చౌకైన స్టీల్ వీల్స్‌పై రన్ కాబోతోంది. అంతేకాకుండా డ్రమ్ బ్రేక్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ బైక్‌లో గ్లోవ్ బాక్స్ కూడా ఉండకపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇందులో 2 ఓపెన్ స్టోరేజ్ క్యూబ్‌లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ కీ-లెస్ ఇగ్నిషన్ సిస్టమ్‌కు బదులుగా ఫిజికల్ ఇగ్నిషన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు మోనోక్రోమ్ LCD డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అలాగే అద్బుతమై బ్రేక్ సెట్టింగ్ ఫీచర్‌తో రాబోతోంది. దీంతో పాటు బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ బైక్ 2.9kWh బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 113 కిమీ మైలేజీని కలిగి ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 73 కిమీ వేగంతో పరిగెడుతుంది. ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే రూ.1 లక్ష ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బజాజ్ చేతక్ 2024 టాప్ 10 ఫీచర్లు:
3.2 kWh బ్యాటరీ ప్యాక్
127 కి.మీ వరకు పరిధి
30 నిమిషాలలో 0 నుంచి 100% వరకు ఛార్జ్
కొత్త డ్రైవింగ్ మోడ్‌లు
అప్‌గ్రేడ్ చేయబడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
LED లైటింగ్
టెయిల్‌లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్లు
కీలెస్ ఎంట్రీ
రెజెనరేటివ్ బ్రేకింగ్
యాంటీ-థెఫ్ట్ అలారం
ఎక్వా మెటాలిక్, ఐస్ బ్లూ, ఇండిగో బ్లాక్ కలర్స్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి