COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bajaj Cng Bike 2024: రోజురోజుకి మార్కెట్లో CNG వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్యాసింజర్ ఆటోలతోపాటు కొన్ని కంపెనీలకు సంబంధించిన కార్లకు మంచి ప్రజాదరణ లభించింది. దీంతో కొన్ని ఆటో కంపెనీలు మోటార్ సైకిల్‌ను కూడా తయారుచేసి త్వరలోనే విక్రయించబోతున్నాయి. ఈ CNG వాహనాలు తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీ ఇవ్వడంతో చాలామంది వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని బజాజ్ కంపెనీ కూడా మరో ముందడుగు వేసింది. త్వరలోనే తమ కొత్త బైక్లను సిఎన్‌జీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. అయితే కంపెనీ మొత్తం మార్కెట్లోకి ఆరు మోటార్ సైకిల్‌లను CNG వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.


అలాగే బజాజ్ కంపెనీ ఇప్పటికే CNG మోటార్ సైకిల్ విడుదలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించింది. భారతదేశంలోని తొలి సిఎన్‌జీ మోటార్ సైకిల్‌ను జూన్ 18వ తేదీన అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కూడా తెలిపింది. దీనిని అద్భుతమైన డిజైన్‌తో, ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి లాంచ్ కాబోయే మొట్టమొదటి CNG బైక్ అద్భుతమైన మైలేజీని కలిగి ఉంటుంది. దీంతో కస్టమర్ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. 


అధికారిక సమాచారం ప్రకారం బజాజ్ మోటార్ సైకిల్ కంపెనీ జూన్ 18వ తేదీనే మొత్తం ఆరు మోటార్ సైకిల్‌లను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే బజాజ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్  అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే విడుదలకు ముందే కొన్ని బైకులకు సంబంధించిన ఫీచర్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం ఏయే ఫీచర్స్‌తో  బజాజ్ కంపెనీ CNG మోటార్‌సైకిల్స్‌ను విడుదల చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


రాబోయే బజాజ్ సిఎన్‌జి బైక్‌లు ముందున్న మోటార్ సైకిల్స్ కంటే ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి పెద్ద ఇంధన ట్యాంకులను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొన్ని బైకులు 100 సిసి ఇంజన్‌తో అందుబాటులోకి వస్తే మరికొన్ని మాత్రం 125 సిసి ఇంజన్‌తో మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్ డిస్క్  వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అలాగే ఇవి  ABS లేదా కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌ సెటప్‌తో రాబోతున్నాయి. ఈ బైకులు రూ. 70,000 నుంచి ప్రారంభయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి