Bajaj Cng Bike 2024: త్వరలోనే మార్కెట్‌లోకి Bajaj Cng 2024 వస్తోంది! ఫీచర్స్ చూడండి..
Bajaj Cng Bike 2024: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో బజాజ్ నుంచి కొత్త బైక్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ CNG వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Bajaj Cng Bike 2024: బజాజ్ మోటర్ సైకిల్ కంపెనీ త్వరలోనే తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలపబోతోంది. కంపెనీ గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన పల్సర్ మరో సారి కొత్త మోడల్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే కంపెనీ దీనిని CNG వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే కొత్త పల్సర్ NS400Z లాంచ్ సందర్భంగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. త్వరలోనే లాంచ్ కాబోయే CNG బైక్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్ స్పెషిఫికేషన్స్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
బజాజ్ CNG బైక్ ప్రత్యేకత:
ఇప్పటికే కంపెనీ ఈ బజాజ్ CNG బైక్‌ను టెస్టింగ్ కూడా చేసిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బైక్‌కి సంబంధించిన ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన ఫిక్స్‌లో భాగంగా చూస్తే, ఇది పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ సెటప్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బైక్ ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఇది 100-125 ccతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఈ బజాజ్ CNG బైక్ టెస్ట్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు మోనోషాక్, డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్‌తో అందుబాటులోకి వస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన భద్రతా నిబంధనలతో మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బైక్‌లో సింగిల్-ఛానల్ ABS, కాంబి-బ్రేకింగ్ ఫీచర్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
బజాజ్ కంపెనీ ఈ CNG బైక్‌కి సంబంధించిన పేరు, ఇతర సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అలాగే బజాజ్ ఇటీవలే బ్రూజర్ అనే పేరును కూడా ప్రస్తావించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇదే పేరు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్‌లో టాక్.. ఇది మార్కెట్‌లో లాంచ్ అయితే మొదటి బజాజ్ సిఎన్‌జి బైక్‌గా నిలుస్తుంది. అలాగే కంపెనీ ఈ బైక్‌ను మొత్తం మూడు మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఫీచర్స్:
లిక్విడ్-కూల్డ్ 373 cc ఇంజన్
39 bhp శక్తి, 35 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్
6-స్పీడ్ యూనిట్
ABS మోడ్‌లు
ట్రాక్షన్ కంట్రోల్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి