Bank Holidays in January: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్. వచ్చే వారం బ్యాంకులకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్లయితే కాస్త ఆగండి. వచ్చే వారంలో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకులకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుగానే రిలీజ్ చేస్తుంది. తద్వారా కస్టమర్లు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని ఉండదు. ఈ సెలవులు రాష్ట్రానికి అనుగుణంగా ఉంటే.. అది దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై ప్రభావం చూపదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే వారం బ్యాంక్ సెలవులు


>> 23 జనవరి 2023-సోమవారం-(నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అస్సాంలో బ్యాంకులు బంద్)
>> 25 జనవరి 2023- బుధవారం -(హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు హాలీడే)
>> 26 జనవరి 2023- గురువారం-(గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
>> 28 జనవరి 2023- నాల్గో శనివారం
>> 29 జనవరి 2023- ఆదివారం


జనవరి 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కారణంగా అస్సాంలో బ్యాంకులకు ఇప్పటికే సెలవు ప్రకటించింది ఆర్బీఐ. హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న బ్యాంకులకు సెలవులు ఉంటాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు బంద్ కానున్నాయి. 


బ్యాంక్ సెలవుల గురించి మరింత సమాచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక లింక్‌ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx కూడా సందర్శించవచ్చు. ఇక్కడ మీరు ప్రతి నెలా ప్రతి రాష్ట్రం బ్యాంకు సెలవుల పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 


Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్  


Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook