Bank Holidays in December 2021: మరి కొన్ని రోజులలో ఈ సంవత్సరపు చివరి నెల అనగా...  డిసెంబర్ 2021 ప్రారంభం అవనుంది. డిసెంబర్ నెలలో బ్యాంక్ సంబంధిత పనిని చేయబోతున్నట్లయితే, ముందుగా RBI జారీ చేసిన సెలవుల గురించి తెలుసుకోండి. డిసెంబర్ నెలలో ఏకంగా 16 రోజుల పాటు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు 
వచ్చే నెలలో, మొత్తం 16 రోజులు బ్యాంక్ సెలవులు (డిసెంబర్) ఉననున్నాయి. ఇందులో 4 సెలవులు ఆదివారాలు. వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి ఏకంగా 16 రోజులు సెలవులు ఉండనున్నాయి. డిసెంబర్ నెలలో వచ్చే కిస్మస్ దాదాపు అన్ని బ్యాంకులకు సెలవులే.. వీటిలో కొన్ని రోజులు స్థానిక  సెలవులు అనగా.. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే సెలవు ఉండగా.. మిగతా రాష్ట్రాల బ్యాంకులు తెరచి ఉండనున్నాయి. 


Also Read: Bumper Offer: రూ. 19,900 ధర గల Samsung 32-ఇంచెస్ TV.. కేవలం రూ. 5,240కే.. త్వరపడండి!


సెలవుల జాబితా విడుదల చేసిన ఆర్‌బీఐ 
ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, ఆదివారాలు కాకుండా నెలలో రెండవ మరియు నాలుగవ శనివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి.  ఆర్‌బిఐ విడుదల చేసిన  జాబితాలో ఏ రాష్ట్రంలో ఏ రోజు బ్యాంకులు మూసివేయబడతాయో.. ఏ రాష్ట్రాలలో బ్యాంకులు తెరచి ఉంటాయో కూడా వివరంగా తెలిపింది. 


డిసెంబర్ 2021లో బ్యాంకు  సెలవుల పట్టిక: 


3 డిసెంబర్  - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ (కనకదాస జయంతి/ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ) (పనాజీలో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


5 డిసెంబర్  -  ఆదివారం (వారం సెలవు)


11 డిసెంబర్ - శనివారం (నెలలో రెండవ శనివారం)


12 డిసెంబర్ - ఆదివారం (వారం సెలవు)


18 డిసెంబర్ - యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూతపడ్డాయి)


19 డిసెంబర్ - ఆదివారం (వారం సెలవు)


Also Read: Big Controversy on BCCI: ఆటగాళ్లకు హలాల్ మాంసం..పంది, గొడ్డు మాంసం నిషేధం..సోషల్ మీడియాలో దుమారం


24 డిసెంబర్ - క్రిస్మస్ పండుగ (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


25 డిసెంబర్ - నాల్గవ శనివారం, క్రిస్మస్ (బెంగళూరు మరియు భువనేశ్వర్ మినహా అన్ని ప్రదేశాలలో బ్యాంకులు మూసివేయబడతాయి)


26 డిసెంబర్ - ఆదివారం (వారం సెలవు)


27 డిసెంబర్ - క్రిస్మస్ వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


30 డిసెంబర్ - యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


31 డిసెంబర్ - నూతన సంవత్సర సాయంత్రం (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook