Bank Holidays December 2022: డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే!
Here is 2022 December Bank Holidays List. నిత్యం బ్యాంకుల వెళ్లే కస్టమర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు పని చేయవు.
Bank branches to be closed for 14 days in 2022 December: 2022 నవంబర్ ముగిసింది. నేటినుంచి డిసెంబర్ మొదలైంది. ఈ నేపథ్యంలో నిత్యం బ్యాంకుల వెళ్లే కస్టమర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలిడే జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకులు పని చేయవు. నిత్యం ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పనిచేస్తూనే ఉన్నప్పటికీ.. బ్యాంకింగ్ కార్యకలాపాలు డిసెంబర్ మాసంలో 14 రోజుల పాటు మూసివేయబడతాయి. మీరు ఈ నెలలో ఏదైనా బ్యాంక్ సంబంధిత ముఖ్యమైన పని కోసం మీరు బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించాలనుకుంటే.. మీ ప్రాంతంలోని మూసివేయబడే రోజుల సంఖ్యను ఓసారి తెలుసుకోండి.
14 రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు కొన్ని సెలవులు ఉండగా.. మరికొన్ని స్థానికంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే డిసెంబర్ మాసంలో 14 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇందులో 8 రోజులు ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ లిస్ట్ ప్రకారం ఉండగా.. మిగతా 6 రోజులు వీకెండ్స్ (రెండో శనివారం, ఆదివారం). డిసెంబర్ నెలలో 4 ఆదివారాలు కాకుండా.. రెండవ, నాల్గవ శనివారాలు ఉన్నాయి. ఈ నెలలో క్రిస్మస్ పండగ, నూతన సంవత్సర వేడుకలు కూడా ఉన్నాయి. అయితే ఈ 14 రోజులు అన్ని ప్రాంతాల్లో ఒకే సమయంలో బ్యాంకులు మూసివేసి ఉండవు.
రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో డిసెంబర్‌లో 3,4,10,11,18,24,25 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు ఉన్నా.. ఆన్‌లైన్‌లో మాత్రం బ్యాంకు సేవలు కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా చేసే పనులు చేయవచ్చు. డిసెంబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం.
డిసెంబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్ ఇదే:
డిసెంబర్ 3 – శనివారం – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ (గోవాలో బ్యాంకు మూసివేత)
డిసెంబర్ 4 – ఆదివారం
డిసెంబర్ 10 – రెండో శనివారం
డిసెంబర్ 11 – ఆదివారం
డిసెంబర్ 12 – సోమవారం – పా-టాగన్ నెంగ్మింజ సంగం (మేఘాలయలో బ్యాంక్ మూసివేయబడింది)
డిసెంబర్ 18 – ఆదివారం
డిసెంబర్ 19 – సోమవారం – గోవా విమోచన దినం (గోవాలో బ్యాంకు మూసివేయబడింది)
డిసెంబర్ 24 – శనివారం – నాల్గవ శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకు మూసివేయబడతాయి)
డిసెంబర్ 25 – ఆదివారం
డిసెంబర్ 26 – సోమవారం – లాసంగ్, నమ్సంగ్ (మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకు మూసివేయబడతాయి)
డిసెంబర్ 29 – గురువారం – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు (చండీగఢ్‌లో బ్యాంక్ మూసి ఉంటుంది)
డిసెంబర్ 30 – శుక్రవారం – యు కియాంగ్ నంగ్వా (మేఘాలయలో బ్యాంక్ మూసి ఉంటుంది)
డిసెంబర్ 31 – శనివారం – నూతన సంవత్సర వేడుకలు (మిజోరంలో బ్యాంకు మూసి ఉంటుంది)
Also Read: Gas Cylinder Price: సామాన్య ప్రజలకు ఊరట.. స్థిరంగా గ్యాస్ సిలిండర్ ధర!
Also Read: Teenamar Mallana: సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే.. నేను అక్కడే చేస్తా: తీన్మార్ మల్లన్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.